అయోధ్యలో ఆలయాన్ని ఆక్రమించుకోవడానికి రాళ్లు, కర్రలతో దాడి...

ఆలయ ప్రధాన మహంత్ అంజనీ శరణ్ దాస్‌తో సహా ఆలయంలో ఉన్న చాలా మందిని దాడి చేసిన వ్యక్తులు కొట్టారు. ఇరువర్గాల మధ్య చాలా సేపు వాగ్వాదం జరిగిందని, ఇటుకలు,రాళ్లు రువ్వారని కూడా వార్తలు వచ్చాయి. 

Stones and sticks attack to occupy temple in Ayodhya - bsb

అయోధ్య : రామమందిరం ప్రారంభోత్సవంతో ప్రపంచదృష్టిని ఆకర్షించిన అయోధ్యలో గుడి ఆక్రమణ కేసులకు దారి తీసింది. రామజన్మభూమి పోలీస్ స్టేషన్ పరిధిలోని విభీషణ్ కుండ్‌లో ఉన్న గీతా భవన్ ఆలయాన్ని స్వాధీనం చేసుకునేందుకు గొడవ జరుగుతోంది. 

ఫిబ్రవరి 1న మొహల్లా రామ్‌కోట్‌లోని గీతా భవన్‌ను కొందరు వ్యక్తులు కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఆలయంలోని మహంత్‌తో పాటు పలువురిని కొట్టారు. ఆలయ ప్రధాన తలుపులు పగులగొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆలయాన్ని కబ్జా చేసేందుకు గతంలోనూ చాలాసార్లు ప్రయత్నాలు జరిగాయి. ఈ విషయం కోర్టులో పెండింగ్‌లో ఉంది. తాజా ఘటన తర్వాత ఇరువర్గాలకు చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

జార్ఖండ్ కొత్త సీఎం: చంపా సోరెన్ ప్రమాణం

అసలు విషయం ఏమిటి?
మీడియా కథనాల ప్రకారం, ఉదయం 9 గంటలకు, రెండు డజన్ల మంది వ్యక్తులు అనేక వాహనాల్లో వచ్చి ఆలయాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. ఈ వ్యక్తుల వద్ద కర్రలు, ఇనుప రాడ్లు మొదలైనవి ఉన్నాయి. దాడి చేసిన వ్యక్తులు ఇనుప రాడ్‌తో ఆలయ ప్రధాన తలుపును పగులగొట్టారు. ఆలయంలో అమర్చిన సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేయడంతో దాడి చేసిన వారిని గుర్తించలేకపోయారు.

ఆలయ ప్రధాన మహంత్ అంజనీ శరణ్ దాస్‌తో సహా ఆలయంలో ఉన్న చాలా మందిని దాడి చేసిన వ్యక్తులు కొట్టారు. ఇరువర్గాల మధ్య చాలా సేపు వాగ్వాదం జరిగిందని, ఇటుకలు,రాళ్లు రువ్వారని కూడా వార్తలు వచ్చాయి. అనంతరం ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలకు చెందిన పలువురిని అదుపులోకి తీసుకున్నారు. 

భద్రతా కారణాల దృష్ట్యా ఆలయ ద్వారం వద్ద అరడజను మంది పోలీసులను మోహరించారు.దీంతో బాధితుడు మహంత్ అంజనీ శరణ్ దాస్ భార్య సునీతాదేవి రామజన్మభూమి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దైనిక్ భాస్కర్ వార్తల ప్రకారం, మహంత్ అంజనీ శరణ్ దాస్ తాను 1992 నుండి గీతా భవన్ మహంత్ గా బాధ్యతను నిర్వహిస్తున్నానని చెప్పాడు. ఇక స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తి పేరు విఘ్న స్వరూప్. విఘ్న స్వరూప్ మాపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. 

గురువారం ఉదయం ఈ వ్యక్తులు ఆలయాన్ని స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రవేశించారు. మరికొందరు స్వామివారి ఆభరణాలను తొలగించడం ప్రారంభించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు స్థానికుల నుంచి నిరసన తెలపడంతో జనం పరుగులు తీశారు. తనను చంపేస్తానని, గుడి ఖాళీ చేయిస్తానని విఘ్న స్వరూప్ బెదిరించాడని అంజనీ శరణ్ దాస్ ఆరోపించారు. ఆలయ నియంత్రణ అంశం కోర్టులో పెండింగ్‌లో ఉందని రామజన్మభూమి పోలీస్ స్టేషన్ ఇంచార్జి దేవేంద్ర పాండే చెప్పారు. విచారణ అనంతరం ఈ వ్యవహారంపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయనున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios