మైనర్ బాలికపై సవతి తండ్రి అత్యాచార యత్నం.. ఆరేళ్ల జైలు శిక్ష విధించిన పోక్సో కోర్టు
సవతి కూతురుపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తికి కోర్టు ఆరేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అలాగే అతడికి రూ.55 వేల ఫైన్ వేసింది. ఉత్తరప్రదేశ్ ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలోని పోక్సో కోర్టు ఈ తీర్పు వెలువరించింది.

మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా కామాంధులకు భయం వేయడం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట మహిళపై అఘాయిత్యాలు జరిగిన ఘటనలు వెలుగులో వస్తూనే ఉన్నాయి. చిన్నారులు, ముసలివాళ్లు అని కూడా చూడకుండా మగాళ్లు మృగాళ్లలా ప్రవర్తిస్తున్నారు. దివ్యాంగులు అని జాలి కూడా చూపకుండా అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. వావి వరుసల మరిచి లైంగిక దాడికి దిగుతున్నారు. రెండేళ్ల కిందట ఉత్తరప్రదేశ్ లో తన సవతి కూతురుపైనే ఓ వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. తాజాగా ఆ కేసులో నిందితుడికి శిక్ష ఖరారు అయ్యింది.
బెంగాల్ మధ్యాహ్న భోజనంలో చికెన్, సీజనల్ పండ్లు.. రాజకీయ ప్రేరేపిత నిర్ణయమంటూ బీజేపీ విమర్శ
వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లోని గోండా జిల్లాకు చెందిన ఓ మహిళ మొదటి భర్త మరణించడంతో ఆమె శంకర్ దీక్షిత్ అనే వ్యక్తి రెండో వివాహం చేసుకుంది. అయితే అప్పటికే ఆమెకు ఎనిమిదేళ్ల కూతురు ఉంది. వీరంతా కలిసి ట్రాన్సిట్ క్యాంప్ అరవింద్ నగర్ లోని ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. అయితే 2021 అక్టోబర్ 13వ తేదీన అర్ధరాత్రి సమయంలో దీక్షిత్ తన సవతి కూతురుపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు.
హిడ్మా సేఫ్‌గానే ఉన్నాడు.. ఆ వార్తల్లో నిజం లేదు: లేఖ విడుదల చేసిన మావోయిస్టులు..
దీనిని తల్లి అడ్డుకుంది. దీంతో దీక్షిత్ ఆమెను దూషించాడు. ఘటన గురించి ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. తరువాత అక్కడి నుంచి పారిపోయాడు. మరుసటి రోజు ఉదయం ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చింది. వారు నిందితుడిని పట్టుకున్నారు. ఐపీసీ సెక్షన్ 354 (మహిళపై దాడి), 354ఏ (లైంగిక వేధింపులు), 504 (శాంతి ఉల్లంఘన), 506 (క్రిమినల్ బెదిరింపు) కింద ట్రాన్సిట్ క్యాంప్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.
ఘోరం.. ఉబర్ మహిళా డ్రైవర్‌పై బీరు సీసాలతో దాడి.. ఢిల్లీలో ఘటన
దీనిపై ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలోని పోక్సో కోర్టులో ఇంత కాలం విచారణ జరిగింది. తాజాగా కోర్టు ఈ కేసులో తీర్పు వెలువరించింది. ఆరేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. శిక్షతో రూ.55 వేల జరిమానా కూడా విధించింది. విచారణ సందర్భంగా ఆరుగురు సాక్షులను విచారించిన న్యాయమూర్తి రీనా నేగి మంగళవారం ఈ తీర్పును వెలువరించారు.