న్యూఢిల్లీ: కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో మంగళవారం నాటి నుండి రాత్రి పూట కర్ప్యూ ను విధిస్తున్నట్టుగా ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకొంది.ఈ నెల 6వ తేదీ నుండి ఈ నెల 30 వ తేదీ వరకు రాత్రి పూట కర్ఫ్యూ కొనసాగనుంది.ఢిల్లీలో కరోనా నాలుగో వేవ్ కొనసాగుతోందని సీఎం కేజ్రీవాల్ ఈ నెల 2వ తేదీన ప్రకటించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ మాత్రం దీనికి పరిష్కారం కాదన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో లాక్ డౌన్ విధించడం పరిష్కారం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనాపై  ఎప్పటికప్పుడు  సమీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. సోమవారం నాడు ఢిల్లీలో 3,548 కొత్త కేసులు నమోదయ్యాయి. మరోవైపు కరోనాతో కొత్తగా 15 మంది మరణించారు.దేశంలో పలు రాస్ట్రాల్లో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. సెకండ్ వేవ్ ఉధృతి చాలా రాష్ట్రాల్లో కొనసాగుతోంది.  ఆయా రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ ఈ నెల 8వ తేదీన వీడియా కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు.