ప్రముఖ సింగర్ కమ్ డ్యాన్సర్  సప్నా చౌదరిని చూసేందుకు జనాలు ఎగబడ్డారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి.. కొందరు అభిమానులు గాయాలపాలయ్యారు. ఈ సంఘటన  రాయ్ గఢ్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... రాయ్ గఢ్ లో ఓ షో నిర్వాహకులు సప్నా చౌదరి చేత డ్యాన్స్ షో ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి ఈ షో నిర్వహించగా.. ఆమె డ్యాన్స్ చూసేందుకు అభిమానులు విపరీతంగా వచ్చారు. ఆమె డ్యాన్స్ మొదలుపెట్టగానే.. కుర్చీలో కూర్చున్న జనమంతా లేచి నిలబడ్డారు. ఈలల కేరింతలు మొదలయ్యాయి. ఈ క్రమంలో వెనకాల ఉన్నవారు.. ముందుకు వచ్చి ఆమె డ్యాన్స్ ని తిలకించాలని భావించారు.

ఈ క్రమంలోనే ఒకరొనికరు తోసుకోవడం మొదలుపెట్టారు.దీంతో తొక్కిసలాట జరిగింది. షో నిర్వాహకులు సరిగా ఏర్పాట్లు చేయకపోవడం వల్లనే ఈ ఘటన చోటుచేసుకుందని అధికారులు చెబుతున్నారు. భద్రత కోసం ఏర్పాటు చేసిన పోలీసులు కూడా అభిమానులు అదుపుచేయడంలో విఫలమయ్యారు.

కాగా.. సప్న చౌదరి డ్యాన్స్ కి వివిధ ప్రాంతాల్లో అభిమానులు ఉన్నారు. ఇదిలా ఉండగా.. తొక్కిసలాటలో గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.