కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి డీఎంకే అధినేత స్టాలిన్ ఫోన్ చేశారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. కాగా... ఈ ఓటమికి బాధ్యత వహిస్తూ... పార్టీ పదవికి రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ నిర్ణయించారు. కాగా..  రాహుల్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఇప్పటి వరకు పార్టీ నేతలు, కీలక నేతలు చాలా మంది చెప్పారు. అయితే... రాహుల్ మాత్రం తన నిర్ణయం మార్చుకున్నట్లు కనిపించడం లేదు.

దీంతో... ఈ విషయంపై మాట్లాడేందుకు స్టాలిన్..మంగళవారం రాహుల్ గాంధీకి ఫోన్ చేశారు. సోనియా, రాహుల్‌తో ఆయన మాట్లాడారు. అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవాలన్న నిర్ణయాన్ని రాహుల్ వెనక్కి తీసుకోవాలని స్టాలిన్‌ కోరారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం కావడంతో ఆ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా  చేసిన విషయం తెలిసిందే. దానిని ఉపసంహరించుకునేందుకు ససేమిరా అంటున్నారు. పార్టీ సీనియర్ నేతలను కలిసేందుకు కూడా ఆయన నిరాకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు ముఖ్య నేతలు రాహుల్‌కు ఫోన్ చేసి తన రాజీనామాను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు.