పశ్చిమ బెంగాల్ హింసలో.. ఎస్ఎస్ రాజమౌళి ‘విక్రమార్కుడు’ సినిమా

పశ్చిమ బెంగాల్‌లో సందేశ్‌కాలి హింసపై దుష్ప్రచారానికి విక్రమార్కుడు సినిమాలోని ఓ పిక్‌ను ఉపయోగించినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎక్స్‌లో ఆ పిక్ షేర్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలతో ట్వీట్ చేశారు.
 

ss rajamoulis vikramarkudu movie pic in west bengals sandeshkhali violence kms

Sandeshkhali: పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌కాలి హింస దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ హింసకు సంబంధించి అనేక విధాలు దుష్ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. తప్పుడు సమాచారంతో హింసను మరింత రెచ్చగొట్టే ప్రయత్నాలూ జరిగినట్టు తెలుస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ వదంతుల వ్యాప్తి కోసం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన విక్రమార్కుడు సినిమా పిక్‌ను కూడా ఉపయోగించుకున్నట్టు వెలుగులోకి వచ్చింది.

ఎక్స్ వేదికగా విక్రమార్కుడు సినిమాలోని ఓ పిక్ షేర్ చేసి.. ఆ ఫొటోకు తప్పుడు క్యాప్షన్ ఇవ్వడంతో ఫేక్ ఇన్ఫర్మేషన్ వైరల్ అవుతున్నది. ఓ మహిళ.. షర్ట్ విప్పేసిన యువకుడి పక్కన బలవంతంగా నిలబడిన పిక్‌ను షేర్ చేస్తూ.. పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌కాలిలో ఓ హిందు మహిళను టీఎంసీ గూండాలు అపహరించారని పేర్కొన్నారు. 

Also Read: Power Cut: మంత్రి మీటింగ్‌లో పవర్ కట్.. సీతక్క మాట్లాడుతుండగానే చీకటిమయం!

ఓ ఎక్స్ హ్యాండిల్ ఈ పిక్ షేర్ చేస్తూ తీవ్ర ఆరోపణలు జోడించాడు. ఒక హిందు మహిళను టీఎంసీ గూండాలు కిడ్నాప్ చేశారని ఆ ట్వీట్‌లో ఆరోపించాడు. ఈ జిహాదీ గూండాలు విక్టరీ సింబల్ చూపిస్తున్నారని పేర్కొన్నాడు. పశ్చిమ బెంగాల్‌ను పాకిస్తాన్‌గా మార్చడానికి మమతా బెనర్జీ ఏ అవకాశాన్నీ వదిలిపెట్టడం లేదని రాశాడు. టీఎంసీ హిందువులను హింసిస్తున్నదని తీవ్ర ఆరోపణలు చేశాడు. విక్రమార్కుడు సినిమా పిక్‌తో ఉన్న ఆ తప్పుడు ట్వీట్‌ను అప్పటికే చాలా మంది షేర్ చేశారు.

అయితే.. ఆ పిక్ విక్రమారుడు సినిమాలోనిది. ఆ ట్వీట్‌లో చెబుతున్నట్టుగా ఓ పశ్చిమ బెంగాల్ మహిళది కాదు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించి రవితేజ, అనుష్కలు ప్రధాన పాత్రల్లో విక్రమార్కుడు సినిమాలో నటించారు. 2006లో విడుదలైన ఈ సినిమా ఆ తర్వాత అక్షయ్ కుమార్, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో రౌడీ రాథోడ్‌గా హిందీలో రీమేక్ చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios