PSLV-C53 mission: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గురువారం నాడు PSLV-C53 మిషన్‌ను ప్రారంభించనుంది. పీఎస్‌ఎల్‌వీలో మూడు ఉపగ్రహాలను ఇస్రో అంతరిక్షంలోకి పంపనుంది.
Isro to launch PSLV-C53 mission: అంతరిక్ష పరిశోధనల్లో అంతర్జాతీయంగా తన సత్తా చాటిన భారత్.. మరో అంతరిక్ష ప్రయోగానికి సిద్ధమైంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గురువారం నాడు తన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ (పిఎస్‌ఎల్‌వి)లో మూడు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనుంది. సింగపూర్‌కు చెందిన మూడు ఉపగ్రహాలను న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్‌తో ఒప్పందం నేపథ్యంలో ఈ ప్రయోగిం కొనసాగుతోంది. దీనికి ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ వేదిక కానుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
PSLV C-523 మిషన్ ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లోని రెండవ లాంచ్ ప్యాడ్ నుండి సాయంత్రం 6:00 గంటలకు ప్రయోగించనున్నారు. లాంచింగ్ ముందు మిషన్ తుది పరిశీలనలు ముగించుకుదనీ, కౌంట్ డౌన్ కూడా ప్రారంభం అయిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. PSLV-C53 అనేది న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ రెండవ వాణిజ్య మిషన్. ఇది PSLV కేటగిరీలో 55వ మిషన్ మరియు PSLV-కోర్ అలోన్ వేరియంట్‌ని ఉపయోగించే 15వ మిషన్ అని ఇస్రో వర్గాలు పేర్కొన్నాయి. శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఇది 16వ పీఎస్‌ఎల్‌వీ ప్రయోగమని తెలిపారు. కొత్తగా అభివృద్ధి చేసిన సంకేతికత డెవలప్‌మెంట్‌లో.. లాంచ్ వెహికల్ విడిపోయిన తర్వాత సైంటిఫిక్ పేలోడ్‌ల కోసం ఒక ప్లాట్‌ఫారమ్‌గా ఉపయోగించేందుకు ఇస్రో ప్రయత్నాలు చేస్తోందిని తెలిపారు.
PSLV-C53 ప్రయోగాన్ని ఇలా లైవ్ లో చూడవచ్చు..
మీరు PSLV-C53 మిషన్ ప్రయోగాన్ని ఏసియానెట్ న్యూస్ లో ఈ పేజీలో లైవ్ లో చూడవచ్చు. అలాగే, యూట్యూబ్ లో పీఎస్ఎల్వీ-సీ53 ప్రయోగానికి సంబంధించిన ఆప్‌డేట్ ఇవ్వనున్నట్టు ఇస్రో పేర్కొంది. ఇప్పటికే ప్రయోగానికి సంబంధించిన లైవ్ లింక్ ను యూట్యూబ్ లో ఉంచింది.

వ్యోమనౌక దాని లాంచ్ ఫెయిరింగ్ DS-EO ఉపగ్రహంలో మూడు ఉపగ్రహాలను తీసుకు వెళ్లనుంది. SAR పేలోడ్‌ను మోసుకెళ్లే సింగపూర్ కు చెందిన మొట్టమొదటి చిన్న వాణిజ్య ఉపగ్రహం NeuSAR. ఇది పగలు మరియు రాత్రి తో పాటు అన్ని వాతావరణ పరిస్థితులలో తన కార్యకాలపాను కొనసాగిస్తూ.. చిత్రాలను అందిస్తుంది. PSLV-C53 228.433 టన్నుల లిఫ్ట్-ఆఫ్ ద్రవ్యరాశిని కలిగివుందని ఇస్రో వర్గాలు తెలిపాయి. దాదాపు 44.4 మీటర్ల పొడవు ఉంటుంది. ప్రయోగ వాహనం DS-EO ఉపగ్రహాన్ని భూమధ్యరేఖ నుండి 570 కి.మీ ఎత్తులో ఉన్న కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది.
