Asianet News TeluguAsianet News Telugu

SpiceJet :  స‌మ‌స్య‌లో స్పైస్‌జెట్‌.. ఒక్కే రోజు రెండు ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్స్ .. 17 రోజుల్లో.. 7 సార్లు..

Spicejet  : ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్​జెట్ సంస్థ‌కు చెందిన విమానాలు వరుస ప్రమాదాలకు గురవుతున్నాయి. మంగళవారం ఉదయం దిల్లీ నుంచి దుబాయ్​ వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య త‌ల్లెత్త‌డంతో అత్యవసరంగా ఆ విమానాన్నికరాచీ వైపు మ‌ళ్లీంచారు. కరాచీ విమానాశ్రయ‌లో ల్యాండ్​ చేశారు

SpiceJet Trouble Karachi Stop, Windshield Cracks On Mumbai Flight
Author
Hyderabad, First Published Jul 6, 2022, 5:35 AM IST

SpiceJet In Trouble:  ప్ర‌ముఖ విమాన‌యాన సంస్థ‌ స్పైస్​జెట్(SpiceJet)కు చెందిన విమానాలు వరుస ప్రమాదాలకు గురవుతున్నాయి. మంగళవారం ఉదయం దిల్లీ నుంచి దుబాయ్​ వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య త‌ల్లెత్త‌డంతో అత్యవసరంగా.. ఆ విమానాన్ని కరాచీ వైపు మ‌ళ్లీంచారు. కరాచీ విమానాశ్రయ‌లో ల్యాండ్​ చేశారు. ఈ ఘటన జ‌రిగిన మ‌రో కొద్ది గంట‌ల్లోనే మరో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్​ చేయ‌బ‌డింది. కాండ్లా-ముంబై విమానంలో విండ్​షీల్డ్​ దెబ్బతినడం వల్ల ముంబయిలో ల్యాండ్​ చేశారు. మంగళవారం జరిగిన తాజా  ప్ర‌మాదాల‌తో పాటు .. గత 17 రోజుల్లో.. 7 సార్లు స్పైస్‌జెట్ విమానాలు సాంకేతిక లోపంతో అత్య‌వ‌స‌ర ల్యాండింగ్ అయ్యాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) తెలిపింది.

అవాంతరాల కారణంగా  కరాచీలో ల్యాండింగ్

మంగళవారం ఉదయం ఢిల్లీ నుంచి దుబాయ్‌కి వెళ్లే బోయింగ్ 737 మ్యాక్స్ విమానం గాలిలో ఉండగానే విమానం ఎడమ ట్యాంక్‌లో ఇంధనం ఒక్క సారిగా..  అసాధారణ రీతిలో తగ్గుదల కనిపించిందని, దీని కారణంగా విమానం కరాచీ వైపు మళ్లిందని అధికారులు తెలిపారు. కరాచీ విమానాశ్రయంలో తనిఖీలు చేయగా, ఎడమ ట్యాంక్ నుంచి ఎలాంటి లీకేజీ కనిపించలేదని చెప్పారు. స్పైస్‌జెట్‌కి చెందిన ఢిల్లీ-దుబాయ్ ఫ్లైట్ పైలట్, పాకిస్థాన్ గగనతలంపై టేకాఫ్ అవుతున్న సమయంలో కంట్రోల్ టవర్‌ను సంప్రదించి, విమానంలో సాంకేతిక లోపం ఏర్పడిందని పాకిస్థాన్ పౌర విమానయాన అథారిటీ (పీసీసీఏ) అధికారి ఒకరు తెలిపారు.

లైట్ ఇండికేటర్‌తో సమస్య 

అత్యవసర పరిస్థితుల్లో విమానాన్ని ల్యాండ్ చేయాలని పైలట్ కోరగా, మానవతా దృక్పథంతో అనుమతి ఇచ్చామని తెలిపారు. దీనిని అనుసరించి, పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఇంజనీర్లు స్పైస్‌జెట్ సిబ్బందితో కలిసి సాంకేతిక లోపాన్ని కనుగొని పరిష్కరించేందుకు కృషి చేశారని అధికారి తెలిపారు.

విమానానికి సంబంధించిన లైట్ ఇండికేటర్ మెషినరీలో సహజంగానే సమస్య ఉందని, అయితే దాన్ని వెంటనే పరిష్కరించలేకపోయామని ఆయన చెప్పారు. కాబట్టి ప్రయాణికులను దుబాయ్‌కు తీసుకెళ్లేందుకు మరో విమానం ఏర్పాటు చేశారు. ఆ ప్ర‌మాద స‌మ‌యంలో విమానంలో సుమారు 150 మంది ప్రయాణికులు ఉన్నారని, వారికి ఆహారం, ఫలహారాలు అందించబడిన‌ట్టు స‌మాచారం.

23,000 అడుగుల ఎత్తులో విండ్‌షీల్డ్ పగుళ్లు

అదే రోజు..  స్పైస్‌జెట్ చెందిన Q400 విమానం 23,000 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు దాని విండ్‌షీల్డ్‌లో  పగుళ్లు సంభవించాయి. అనంతరం.. ప్రాధాన్యత ఆధారంగా ముంబై విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అయితే గుజరాత్‌లోని కాండ్లా నుంచి వస్తున్న ఈ విమానం క్యాబిన్‌లో ఎలాంటి ఒత్తిడి లేదని డీజీసీఏ అధికారులు తెలిపారు.

కాండ్లా-ముంబై విమానానికి సంబంధించిన సంఘటనపై స్పైస్‌జెట్ స్పందిస్తూ.. జులై 5న స్పైస్‌జెట్ క్యూ400 విమానం.. కాండ్లా నుంచి ముంబైకి వెళ్లున్న విమానం  23,000 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు, దాని P2 వైపున ఉన్న విండ్‌షీల్డ్ బయటి గాజులో పగుళ్లు ఏర్పడింది. ఒత్తిడి సాధారణంగా ఉన్నట్లు గమనించబడింది. ముంబైలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. అదే సమయంలో.. ఢిల్లీ-దుబాయ్ విమానానికి సంబంధించిన సంఘటనపై స్పైస్‌జెట్ స్పందించింది. సాంకేతిక కార‌ణాల‌తో ఆ విమానాన్ని కరాచీ వైపు మళ్లించారు. కరాచీలో విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులను ఎలాంటి హని జ‌ర‌గ‌లేదు.  ప్రయాణికులను దుబాయ్‌కు తీసుకెళ్లే మరో విమానం కరాచీకి పంపబడిన‌ట్లు తెలిపారు. 

 జూన్ 19న, 185 మంది ప్రయాణికులతో పాట్నా నుండి ఢిల్లీకి బయలుదేరిన వెంటనే, ఎయిర్‌లైన్స్ విమానం మంటల్లో చిక్కుకుంది. దీంతో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. పక్షి ఢీకొనడంతో ఇంజిన్‌లో లోపం ఏర్పడింది. అదేరోజు జ‌రిగిన మరో ఘటనలో క్యాబిన్‌లో ఒత్తిడి సమస్య తలెత్తడంతో ఢిల్లీ నుంచి జబల్‌పూర్ వెళ్తున్న విమానం తిరిగి ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. అదేవిధంగా జూన్ 24, 25 తేదీల్లో వేర్వేరు విమానాల్లో 'ఫ్యూజ్‌లేజ్‌ డోర్‌ వార్నింగ్‌' సిస్టమ్‌ యాక్టివేట్‌ కావడంతో విమానం మధ్యలోనే ప్రయాణాన్ని వదిలి తిరిగి రావాల్సి వచ్చింది. అదే సమయంలో జూలై 2న జబల్‌పూర్‌కు వెళ్తున్న విమానం దాదాపు ఐదు వేల అడుగుల ఎత్తులో ఉన్నప్ప‌డు క్యాబిన్‌లో పొగలు రావడంతో సిబ్బంది తిరిగి ఢిల్లీకి చేరుకున్నారు.

నష్టపోతున్న సంస్థ

స్పైస్‌జెట్‌ గత మూడేళ్లుగా నష్టాల్లో కూరుకుపోవడం గమనార్హం. చౌకైన సేవలను అందించే స్పైస్‌జెట్ 2018-19, 2019-20, 2020-21లో వరుసగా రూ. 316 కోట్లు, 934 కోట్లు మరియు రూ. 998 కోట్లు నష్టపోయింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios