18 రోజుల్లో 8 విమానాల్లో సాంకేతిక లోపాలు వెలుగుచూడంతో స్పైస్ జెట్ పై డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనలపై వివరణ ఇవ్వాలంటూ బుధవారం నోటీసులు జారీ చేసింది. దీనిపై ఆ సంస్థ స్పందించాల్సి వుంటుంది. 

స్పైస్‌జెట్ సంస్థకు డీజీసీఏ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. గత కొన్నిరోజులుగా ఈ సంస్థకు చెందిన విమానాల్లో వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. 18 రోజుల్లో 8 విమానాల్లో సాంకేతిక లోపాలు వెలుగుచూడంతో డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై వివరణ కోరుతూ ఇవాళ నోటీసులు జారీ చేసింది. 

కాగా.. మంగళవారం ఉదయం దిల్లీ నుంచి దుబాయ్​ వెళ్తున్న స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక సమస్య త‌ల్లెత్త‌డంతో అత్యవసరంగా.. ఆ విమానాన్ని కరాచీ వైపు మ‌ళ్లీంచారు. కరాచీ విమానాశ్రయ‌లో ల్యాండ్​ చేశారు. ఈ ఘటన జ‌రిగిన మ‌రో కొద్ది గంట‌ల్లోనే మరో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్​ చేయ‌బ‌డింది. కాండ్లా-ముంబై విమానంలో విండ్​షీల్డ్​ దెబ్బతినడం వల్ల ముంబయిలో ల్యాండ్​ చేశారు. మంగళవారం జరిగిన తాజా ప్ర‌మాదాల‌తో పాటు .. గత 17 రోజుల్లో.. 7 సార్లు స్పైస్‌జెట్ విమానాలు సాంకేతిక లోపంతో అత్య‌వ‌స‌ర ల్యాండింగ్ అయ్యాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) తెలిపింది.

Q400 విమానం 23,000 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు దాని విండ్‌షీల్డ్‌లో పగుళ్లు సంభవించాయి. అనంతరం.. ప్రాధాన్యత ఆధారంగా ముంబై విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అయితే గుజరాత్‌లోని కాండ్లా నుంచి వస్తున్న ఈ విమానం క్యాబిన్‌లో ఎలాంటి ఒత్తిడి లేదని డీజీసీఏ అధికారులు తెలిపారు. కాండ్లా-ముంబై విమానానికి సంబంధించిన సంఘటనపై స్పైస్‌జెట్ స్పందిస్తూ.. జులై 5న స్పైస్‌జెట్ క్యూ400 విమానం.. కాండ్లా నుంచి ముంబైకి వెళ్లున్న విమానం 23,000 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు, దాని P2 వైపున ఉన్న విండ్‌షీల్డ్ బయటి గాజులో పగుళ్లు ఏర్పడింది. ఒత్తిడి సాధారణంగా ఉన్నట్లు గమనించబడింది. ముంబైలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది.