Asianet News TeluguAsianet News Telugu

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి, మరో ముగ్గురికి గాయాలు


తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.

Speeding van rams lorry on Tamil Nadu highway, 6 dead lns
Author
First Published Sep 6, 2023, 10:28 AM IST | Last Updated Sep 6, 2023, 10:52 AM IST

న్యూఢిల్లీ:తమిళనాడు రాష్ట్రంలోని  సేలం జిల్లాలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు.
ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఎంగూరుకు చెందిన ఎనిమిది మంది ప్రయాణీస్తున్నారు.  ఎంగూరు నుండి  పెరుంతురై వైపు వెళ్తున్న సమయంలో  ఈ ప్రమాదం జరిగింది. సెల్వరాజ్, మంజుల, ఆరుముగం, పళనిస్వామి, పాపతితో పాటు ఏడాది వయస్సున్న  చిన్నారి మృతి చెందింది.

ఈ ప్రమాదంలో  వ్యాన్ డ్రైవర్ విఘ్నేష్, మరో ఇద్దరు గాయపడ్డారు. వారిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై  పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు చేసే సమయంలో రోడ్డుకు సమీపంలోని  సీసీటీవీ పుటేజీని పోలీసులు పరిశీలించారు.   ఈ సీసీటీవీ పుటేజీలో  రోడ్డు ప్రమాదం దృశ్యాలు కన్పించాయి. మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం  సమీపంలోని  ఆసుపత్రికి తరలించారు. అతి వేగం,  డ్రైవర్ నిద్రమత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

దేశంలోని ప్రతి రోజూ ఏదో ఒక చోట  ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, అతి వేగంతో పాటు  ఇతరత్రాల కారణాలు రోడ్డు ప్రమాదాలకు కారణంగా మారుతున్నాయి.రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. కానీ, డ్రైవర్లు మాత్రం పాటించడం లేదు. 

ఈ నెల  4వ తేదీన కర్ణాటకలోని చిత్రదుర్గ మల్లాపుర వద్ద  కారు, లారీ ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. 48వ జాతీయ నెంబర్ రహదారిపై  ఈ ప్రమాదం జరిగింది.ఈ నెల  3వ తేదీన  బాపట్ల జిల్లాలోని సంతమాగులూరు వద్ద  జరిగిన రోడ్డు ప్రమాదంలో  ఐదుగురు మృతి చెందారు.  ఆటో, లారీని ఢీకొట్టిన ప్రమాదంలో  ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.మరో ఇద్దరు ఆసుపత్రిలో  చికిత్స పొందుతూ మృతి చెందారు.మృతుల్లో నలుగురు మహిళలే.

also read:ఘోర రోడ్డు ప్ర‌మాదం: ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు, నలుగురు మృతి

బీహార్ రాష్ట్రంలోని రోహతాస్ జిల్లాలో  కంటైనర్ ను కారు ఢీకొన్న ప్రమాదంలో  ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు.ఈ ఘటన  ఈ ఏడాది ఆగస్టు 30న చోటు చేసుకుంది.ఢీల్లీ-కోల్‌కత్తా  జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.నేపాల్ లోని  బారా జిల్లాలో  ఈ ఏడాది ఆగస్టు 24న జరిగిన  రోడ్డు ప్రమాదంలో  ఆరుగురు మృతి చెందారు. మరో 19 మంది గాయపడ్డారు.
భారత ప్రయాణీకులతో  వెళ్తున్న బస్సు  ఖాట్మాండ్ నుండి జనక్ పూర్ వైపు వెళ్తున్న సమయంలో  ప్రమాదవశాత్తు లోయలో పడింది.ఈ ప్రమాదంలో ఆరుగురు భారత ప్రయాణీకులు మృతి చెందారు. మరో 19 మంది గాయపడ్డారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios