Special wedding contract: ఓ పెళ్లిలో వరుడి స్నేహితులు వధువుతో కొన్ని ఫ‌న్నీ ష‌రుతుల‌తో కూడిన ఒప్పందంపై సంతకం చేయించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాతో తెగ వైర‌ల్ అవుతోంది.  

Special wedding contract: మ‌న‌దేశంలో వివాహాలు ఎంత ఘ‌నంగా నిర్వ‌హిస్తారో అంద‌రికీ తెలుసు.. పెళ్లికి సంబంధించిన ప్ర‌తి మూమెంట్ ను త‌మ జీవితంతో మరిచిపోలేని విధంగా.. చాలా గ్రాండ్ గా నిర్వ‌హిస్తుంటారు. ఇక‌ వధూవరులు, వారి స్నేహితులు చేసే సందడి మామూలుగా ఉండ‌దు. ఈ క్ర‌మంలో జ‌రిగే కొన్ని ఫ‌న్నీ మూమెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఇందులో కొన్ని వీడియోలు నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని వీడియోలు వినోదాన్ని పంచుతాయి. చాలా వీడియోలు నెటిజ‌న్ల హృదయాన్ని తాకుతున్నాయి. తాజాగా ఓ పెళ్లిలో పెళ్లికొడుకు స్నేహితులు.. పెళ్లి కూతురుతో కొన్ని ష‌ర‌తులతో కూడిన ఓ కాంట్రాక్ట్ మీద సంత‌కం చేయించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫ‌న్నీ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 

ఈ వీడియోలో వేదికపై వధూవరులు కూర్చున్న దృశ్యం కనిపిస్తుంది. ఈ సమయంలో వరుడి స్నేహితులు వేదిక‌పైకి పెద్ద సైన్ బోర్డులాంటిది తీసుకుని వ‌స్తారు. అది తీరా ప‌రీక్షించి చూడ‌గా.. అదో అగ్రిమెంట్.. అందులో వధువుపై కొన్ని షరతులు వ్రాయబడ్డాయి. ఇందులో మొదటి పాయింట్ 'పెళ్లికూతురు ఇంటి పనులు చేయ‌డానికి అస‌లు నిరాకరించ‌కూడ‌దు. రెండో పాయింట్ రోజూ చీర కట్టుకోవాలి . మూడ‌వ‌ పాయింట్ ప్ర‌తిరోజు ఒక గంట పూజ చేయాలి.
నాల్గవ పాయింట్ తక్కువగా మాట్లాడాలి.లేట్ లైట్ పార్టీలు వెళ్లడానికి అనుమతించాలి.

ప్రతిరోజూ జిమ్‌కి వెళ్లాలి. ఆదివారం మాత్ర‌మే అల్పాహారం తయారు చేయాలి. ప్రతి పార్టీలో ఒక మంచి ఫోటో క్లిక్ చేయాలి. 15 రోజులకు ఒక్క‌సారే షాపింగ్ చేయాలి. అని ఇలా చాలా ఫ‌న్నీ షరతుల‌ను ప్ర‌స్త‌వించారు. అగ్రిమెంట్ చివరలో.. వధువు అన్నింటికీ అంగీకరించాలి, లేకపోతే వరుడి ఇంట్లోకి ప్రవేశం లేదని వ్రాయబడింది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. వ‌రుడు రిక్వెస్ట్ చేయ‌డంతో వధువు ఆ ఒప్పందంపై సంతకం చేసింది. ఈ వీడియోను సిమ్రాన్‌బలార్జైన్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేశారు.

ఈ పెళ్లి ఒప్పందాన్ని సోష‌ల్ మీడియాలో కామెంట్ల వ‌ర్షం కురుస్తోంది. కొన్ని ష‌ర‌తులు ఓకే గానీ, కొన్ని ష‌ర‌తులు మరీ దారుణంగా ఉన్నాయని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. మరో వినియోగదారు ఇప్పటికే సంతకం చేయడం మంచిది, లేకుంటే భర్త తర్వాత తన మాటలను వెనక్కి తీసుకుంటాడు. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో అలరిస్తుంది. చాలా మంది ఇలాంటి డీల్ చేసేందుకు మేం రెడీ అంటున్నారు.

View post on Instagram