గత నెలలో జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై జైషే మహ్మద్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 40 మందిపైగా సైనికులు అమరులైన సంగతి తెలిసిందే.

గత నెలలో జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై జైషే మహ్మద్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 40 మందిపైగా సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జవాన్ల భద్రత కోసం ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది.

జవాన్లను పెద్ద సంఖ్యలో తరలించకుండా ఉండటంతో పాటు వీరు ప్రయాణించే మార్గాల్లో సాధారణ పౌరుల వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు. అలాగే కాన్వాయ్‌లకు రక్షణగా బుల్లెట్ ప్రూఫ్ సైనిక వాహనాల సంఖ్యను మరింత పెంచాలని నిర్ణయించారు.

అలాగే ఈ సైనికులను తరలింపు వ్యవహారం ఎస్పీ ర్యాంక్ అధికారుల పర్యవేక్షణలో కొనసాగనుంది. ఈ మేరకు ప్రభుత్వం కొత్తగా ప్రామాణిక కార్యాచరణ విధానం రూపొందించినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి.