ముంబై:మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారితో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తున్నారు.ఇవాళ సాయంత్రం ఐదు గంటలలోపుగా బలపరీక్ష చేయాలని సుప్రీంకోర్టు మంగళవారంనాడు ఆదేశించింది.

 

బుధవారం నాడు ఉదయం మహారాష్ట్ర అసెంబ్లీకి హాజరైన ఎమ్మెల్యేలకు ఎన్సీపీ నేత సుప్రియా సూలే స్వాగతం పలికారు. ఎన్సీపీ నేత అజిత్ పవార్, శివసేన ఎమ్మెల్యే ఆధిత్య ఠాక్రేలు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. అసెంబ్లీకి వచ్చిన ఎన్సీపీ నేత అజిత్ పవార్ ను ఎంపీ సుప్రియా సూలే ఆప్యాయంగా కౌగిలించుకొంది. అజిత్ పవార్ కాళ్లకు నమస్కారం చేశారు.

అజిత్ పవార్ తిరిగి ఎన్సీపీ గూటికి చేరడం సంతోషంగా ఉందని ఆ పార్టీ నేత, ఎమ్మెల్యే రోహిత్ పవార్ అభిప్రాయపడ్డారు. మరో వైపు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేతో ప్రొటెం స్పీకర్ కాళిదాస్ కొలంబర్ ఎమ్మెల్యేలతో  ప్రమాణం చేయిస్తున్నారు.  బాబన్ రావు పచ్‌పూటే, విజయ్ కుమార్ గవిటేలు తొలుత ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత అపద్ధర్మ సీఎం ఫడ్నవీస్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు.