బెంగుళూరు:  సరైన ఫార్మెట్‌లోనే  రాజీనామాలను సమర్పించాలని కర్ణాటక స్పీకర్ రమేష్ అసంతృప్త ఎమ్మెల్యేలకు సూచించారు.కర్ణాటకలోని జేడీ(ఎస్), కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంపై అసంతృప్తితో 13 మంది సంకీర్ణ కూటమిలోని ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు.

మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. రాజీనామాలు సమర్పించిన 13 ఎమ్మెల్యేల్లో 8 మంది ఎమ్మెల్యేలు  సరైన ఫార్మెట్‌లో రాజీనామాలు చేయలేదన్నారు.

ఐదుగురు ఎమ్మెల్యేలను  విడతలుగా కలుస్తామన్నారు. ఇద్దరిని ఈ నెల 12వ తేదీన కలిసేందుకు సమయం ఇచ్చినట్టుగా స్పీకర్ చెప్పారు. ఈ నెల 15వ తేదీన  మిగిలిన సభ్యులను కలుస్తామన్నారు.అసంతృప్త ఎమ్మెల్యేల వ్యవహరంపై గవర్నర్‌కు లేఖ రాస్తామన్నారు.రెబెల్ ఎమ్మెల్యేలు తన ముందు హాజరుకావాలని ఆయన కోరారు.

తాను  రాజ్యాంగం ప్రకారంగానే నిర్ణయం తీసుకొంటానని స్పీకర్ రమేష్ స్పష్టం చేశారు. తాను తీసుకొనే నిర్ణయాలు చరిత్రను సృష్టిస్తాయని ఆయన స్పష్టం చేశారు. తాను ఎలాంటి తప్పులు చేయనన్నారు.