స్పీకర్ సౌండ్ తగ్గించమన్నందుకు జరిగిన గొడవ ఒకరి హత్యకు దారితీసిన ఘటన దేశ రాజధాని దిళ్లీలో కలకలరం రేపింది. డిల్లీలోని భథోలా లో ఉండే సుశీల్, సునీల్, అనీల్ లు అన్నాదమ్ములు. తమ ఇంటి పక్కనుండే సత్తార్ ఫుల్ సౌండ్ తో స్పీకర్ పెట్టడంతో అతనితో వాగ్వాదానికి దిగారు.

సౌండ్ తగ్గించమని ఎన్నిసార్లు చెప్పినా సత్తార్ వినలేదు. దీంతో గొడవ పెద్దదై కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ గొడవలో సత్తార్ ను అతని ఇద్దరు కొడుకులు అనీల్, సునీల్, సుశీల్ లను కత్తితో విచక్షణా రహితంగా పొడిచారు. స్థానికులు వెంటనే వీరిని ఆస్పత్రికి తరలించగా సుశీల్ దారిలోనే మరణించాడు. అనిల్ పరిస్థితి విషమంగా ఉంది. 

సునీల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సత్తార్ ను అతని ఇద్దరు కొడుకులను అరెస్ట్ చేశారు. దాడిలో పాల్గొన్న మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఈ దాడిలో సత్తార్, ఆయన భార్య షాజహాన్ కు కూడా గాయాలయ్యాయి. బాధిత కుటుంబాన్ని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పరామర్శించారు. వారికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.