బెంగుళూరు: రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామా నిర్ణయంపై  ఇవాళ సాయంత్రం  వరకే నిర్ణయం తీసుకోవాలని  సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంపై కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్  సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అసంతృప్త ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి తనకు మరింత సమయం కావాలని  ఆయన సుప్రీంకోర్టును కోరారు.

కర్ణాటకకు చెందిన అసంతృప్త ఎమ్మెల్యేల రాజీనామా విషయమై  ఇవాళ సాయంత్రం వరకు నిర్ణయం తీసుకోవాలని  సుప్రీంకోర్టు గురువారంనాడు ఆదేశాలు జారీ చేసింది.అయితే ఈ విషయమై తనకు మరింత సమయం కావాలని  సుప్రీంకోర్టును స్పీకర్ రమేష్ కుమార్  గురువారం నాడు ఆశ్రయించారు.

అయితే ఈ విషయమై ఇవాళ ఉదయమే ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.మరో వైపు ఈ విషయమై విచారణను రేపటికి వాయిదా వేసిన విషయాన్ని సుప్రీంకోర్టు ప్రస్తావించింది.