Asianet News TeluguAsianet News Telugu

లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్న దక్షిణ కొరియా యువతిపై వేధింపులు.. ముంబయి యువకుల అరెస్టు..

సౌత్‌ కొరియాకు చెందిన ఓ మహిళా యూట్యూబర్‌ను ఇద్దరు ముంబయి యువకులు వేధింపులకు గురి చేశారు. ఆ యువతి ప్రతిఘటిస్తున్నా వదలని యువకుడు ఆమె చేయి పట్టుకుని లిప్ట్ ఇస్తానని బలవంతం చేశాడు. ఆ తర్వాత ఆమెను ముద్దుపెట్టుకునే ప్రయత్నం చేశాడు. ఆమె తన ఇల్లు సమీపంలోనే ఉందని వారి నుంచి తప్పించుకుని వచ్చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు వీడియో ఆధారంగా కేసు నమోదు చేసి ఇద్దరు యువకులను అరెస్టు చేశారు.

South Korean YouTuber Harassed In Mumbai While Livestreaming
Author
First Published Dec 1, 2022, 11:58 AM IST

కొరియన్ యువతిపై వేధింపులు: ముంబైలోని ఓ వీధిలో దక్షిణ కొరియా యూట్యూబర్ వేధింపులను గురైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఒక్క నిమిషం నిడివి గల వీడియోలో.. నడిరోడ్డుపై యువతి చేయి పట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ ఘటన మంగళవారం రాత్రి ముంబయిలో చోటుచేసుకుంది.బాధిత యువతి లైవ్ స్ట్రీమింగ్‌లో ఉండగా అక్కడికి వచ్చిన ఓ ఆకతాయిలు ఆమె చేయి పట్టుకుని బలవంతంగా బైక్ వద్దకు లాక్కెళ్లడం చూడవచ్చు. ఆమె ‘నో.. నో.. నో’ అని అరుస్తున్నా పట్టించుకోకుండా బలవంతం చేయడం. ఆమెను కిస్ చేయడం చూడవచ్చు. ఈ వీడియోను ఆమె ట్విట్టర్ హ్యాండిల్ లో షేర్ చేస్తూ.. ఖార్ ప్రాంతంలో ప్రత్యక్ష ప్రసారం చేస్తుందని పేర్కొన్నారు. ఈ ఘటన రాత్రి 8 గంటల ప్రాంతంలో జరిగిందని ఆమె తెలిపారు.

ముంబైలో లైవ్ స్ట్రీమింగ్ సందర్భంగా కొరియన్ మహిళను వేధించిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.  ఆ వీడియో గురించి మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌లో పంచుకున్న వీడియోలో.. నిందితులలో ఒకరు కొరియన్ యూట్యూబర్‌ని ఖార్‌లో తన చేతితో లాగడం కనిపించింది. మరో ఆ యువకుడు మళ్లీ స్కూటీతో తిరిగి వస్తాడు.అతనితో పాటు మరొక అబ్బాయి కూడా కూర్చున్నాడు. అమ్మాయిని వెంబడించి.. లిఫ్ట్ ఇస్తానని బలవంతం చేశారు. కానీ, అమ్మాయి నా ఇల్లు సమీపంలో ఉంది అని చెప్పింది. నాకు లిఫ్ట్ అక్కర్లేదు. కుర్రాడుపై ఆమె అసహనం వ్యక్తం చేసింది. అని పోలీసులు పేర్కోన్నారు. 

ఆ వీడియోను రీట్వీట్ చేస్తూ .. ఆ మహిళ ఇలా రాసింది

'నిన్న రాత్రి స్ట్రీమింగ్‌లో ఉన్నప్పుడు.. నన్ను ఇబ్బంది ఓ యువకుడు ఇబ్బంది పెట్టాడు. నేను పరిస్థితి చేయిదాటిపోకుండా ఉండేందుకు నా వంతు ప్రయత్నం చేసి.. అక్కడి నుంచి బయటపడ్డాను. నేను స్ట్రీమింగ్‌లో నెటిజన్లతో సంభాషిస్తున్న తరుణంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన నన్ను స్ట్రీమింగ్ గురించి మళ్లీ ఆలోచించేలా చేస్తుంది. వీడియో ఆధారంగా పోలీసులు లైంగిక వేధింపుల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios