రాజ్యసభ ఎన్నికల నామినేషన్ కు గడువు దగ్గరపడింది. రేపే చివరిరోజు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటివరకు కేవలం 4 సీట్లు మాత్రమే ప్రకటించింది. 

ఢిల్లీ : జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ రాజ్యసభ ఎన్నికలకు రెడీ అయింది. ఇప్పటికే సోనియా గాంధీ, అఖిలేష్ ప్రసాద్ సింగ్, అభిషేక్ మను సింఘ్వీ, చంద్రకాంత్ హాండర్ లను నలుగురు అభ్యర్థులుగా ఆయా రాష్ట్రాల నుంచి ప్రకటించింది. కాగా, మొత్తం 15 రాష్ట్రాల్లోనే 56 రాజ్యసభ స్థానాలకు ఫిబ్రవరి 27వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. త్వరలో తెలంగాణ నుంచి రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు. ఈ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసే చివరి తేదీ ఫిబ్రవరి 15. ఇప్పటికే బిజెపి, టీఎంసీ, బీజేడీ సహా అనేక పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. 

ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా బీహార్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ల అభ్యర్థులను ప్రకటించింది. సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పోటీ చేయనున్నారు. 56 స్థానాల్లో కేవలం 4 స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించడంతో.. ఈరోజు అభ్యర్థుల పూర్తి జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. మిగతా అభ్యర్థుల పేర్లపై మేధోమధనం జరుగుతున్నట్లుగా సమాచారం. 


Scroll to load tweet…