Ayodhya: రామ మందిరం ప్రారంభోత్సవానికి సోనియా గాంధీ

రామ మందిర ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ హాజరు కాబోతున్నట్టు కొన్ని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జనవరి 22న నిర్వహించే ఈ కార్యక్రమానికి హాజరు కావాలని సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, అధిర్ రంజన్ చౌదరిలకు ఆహ్వానం అందింది.
 

sonia gandhi to attend ram temple consecration ceremony on january 22 kms

Sonia Gandhi: వచ్చే నెల 22వ తేదీన అయోధ్యలోని రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతున్నారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ సీనియన్ నాయకురాలు సోనియా గాంధీ, లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరికి అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానాలు అందాయి. ఈ వేడుకకు సోనియా గాంధీ హాజరు అవుతారని కొన్ని విశ్వసనీయ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి.

అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమికి సంకటంగా మారింది. ఈ కార్యక్రమానికి వెళ్లాలా? వద్దా? అనే మీమాంసలో పార్టీలు పడిపోయాయి. ఈ కూటమిలో భిన్న భావజాలాలు గల పార్టీలు ఉన్నాయి. దీంతో వచ్చే నెల 22వ తేదీన జరిగే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి తప్పక వెళ్లాల్సిందేనని కొన్ని పార్టీలు చెబుతుండగా.. మరికొన్ని పార్టీలు మాత్రం తాము వెళ్లేదే లేదని మీడియా ముఖంగా తేల్చేశాయి. కూటమిలోని పార్టీల మధ్యే కాదు.. కూటమి సారథి కాంగ్రెస్ పార్టీలోనే రెండు రకాల మాటలు వినిపిస్తున్నాయి.

Also Read: Congress: ప్రతిపక్ష కూటమికి అయోధ్య సవాల్.. రామ మందిర కార్యక్రమానికి వెళ్లాలా? వద్దా?

ఈ కూటమిలోని తృణమూల్ కాంగ్రెస్, ముస్లిం లీగ్ సీపీఎం పార్టీలు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి వెళ్లబోమని స్పష్టం చేశాయి. ఇది కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగానే మారింది. ఈ నిర్ణయాలను బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకుంటుందనడంలో సందేహం లేదు. అయోధ్యకు వెళ్లినా, డుమ్మా కొట్టినా బీజేపీ ఫలితం రాబట్టం ఖాయంగా ఉన్నది. దీంతో కాంగ్రెస్ దిగ్గజాలు మేధోమథం చేస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios