Asianet News TeluguAsianet News Telugu

"నేను మీ కొడుకుగా గర్వపడుతున్నాను" భావోద్వేగానికి లోనైన రాహుల్

రెండు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ అధ్యక్షురాలి పదవీ నుంచి సోనియా గాంధీ వైదొలిగారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ భావోద్వేగానికి గురయ్యారు. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టులు చేశారు. 
 

Sonia Gandhi Resigns As Congress President And Rahul And Priyanka Share Photo On Social Media
Author
First Published Oct 27, 2022, 4:21 AM IST

ఎన్నో వివాదాల తర్వాత ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీకి గాంధేతర కుటుంబం నుంచి కొత్త అధ్యక్షుడు ఎన్నికయ్యారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అదే సమయంలో దాదాపు 23 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వ్యవహరించిన సోనియా గాంధీ ఆ పదవి నుండి రిలీవ్ అయ్యారు. సోనియా గాంధీ పదవి నుండి వైదొలగిన నేపథ్యంలో పార్టీ సీనియర్ నేతలు  రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో సహా పలువురు నేతలు ఆమె  పదవీకాలాన్ని, ఆమె సేవలను గుర్తు చేసుకుంటున్నారు.

భావోద్వేగానికి లోనైన రాహుల్ గాంధీ 

భారత జోడో పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ తన తండ్రిని గుర్తుచేసుకుంటూ భావోద్వేగ ట్వీట్ చేశారు, అందులో తన తల్లి సోనియా గాంధీ తన దివంగత భర్త రాజీవ్ గాంధీ చిత్రాన్ని పట్టుకుని ఉన్నారు. మీలాంటి కూతుర్ని ఎప్పటికీ పొందలేమని అమ్మ, అమ్మమ్మ ఒకసారి నాకు చెప్పారని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఆమె చెప్పింది నిజమే, నేను మీ కొడుకుగా గర్వపడుతున్నాను. అని ఎమోషనల్ గా ట్వీట్ చేశారు. 

అదే సమయంలో..ప్రియాంక గాంధీ తన తల్లి సోనియా గాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ చిత్రాన్ని పంచుకుంటూ.. భావోద్వేగ పోస్ట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన తల్లి సోనియా గాంధీ పట్ల గౌరవం వ్యక్తం చేస్తూ..నాకు తెలుసు, మీరు ప్రేమ కోసమే ఇదంతా చేశారంటూ రాసుకోచ్చారు.

 

 

నేడు తలపై నుండి ఒక భారం దిగింది: సోనియా గాంధీ

బలహీన కుటుంబం నుంచి వచ్చిన నాయకుడిని పార్టీ ఎన్నుకోవడం పెద్ద విషయమని సోనియా గాంధీ అన్నారు. తన కృషి, అంకితభావంతో ఇక్కడికి చేరుకున్నాడు. ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ గతం కంటే మెరుగ్గా పుంజుకుంటుందన్న నమ్మకం ఉందని అన్నారు. కాంగ్రెస్ తన కొత్త అధ్యక్షుడిని ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకుందని చెప్పారు. ఈ విధంగా కాంగ్రెస్ నాయకులందరూ దేశ సమస్యలను విజయవంతంగా ఎదుర్కోగల శక్తిగా మారతారని ఖచ్చితంగా అనుకుంటున్నని తెలిపారు. కాంగ్రెస్ ముందు పెద్ద పెద్ద సమస్యలు వచ్చినా కాంగ్రెస్ ఏనాడూ పట్టు వదలలేదని, ఈ విషయాన్ని ఖచ్చితంగా చెప్పగలనని సోనియా గాంధీ అన్నారు. తన తలపై నుండి ఒక భారం దిగిందనీ, సహజంగానే ఉపశమనం కలుగుతుందని అన్నారు.తనకు  సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నానని సోనియా గాంధీ పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios