కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కరోనా బారిన పడ్డారు. బుధవారం ఆమెకు స్వల్ప జ్వరం రావడంతో కరోనా టెస్టు చేసుకున్నారని, అందులో పాజిటివ్ అని వచ్చినట్టు కాంగ్రెస్ నేత సుర్జేవాలా తెలిపారు. ప్రస్తుతం ఆమె సెల్ఫ్ ఐసొలేషన్‌లో ఉన్నట్టు వివరించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణకు హాజరవ్వాలని నోటీసులు వచ్చిన రోజే ఆమె కరోనా బారినపడ్డారు. 

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కరోనా బారిన పడ్డారు. నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణకు హాజరవ్వాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసిన తర్వాత ఆమె కొవిడ్ బారిన పడ్డాారు. ఈ నెల 8వ తేదీన ఆమె ఈడీ ముందు హాజరవ్వాల్సి ఉన్నది. సోనియా గాంధీ కరోనా బారిన పడ్డట్టు కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా వెల్లడించారు. గత వారం రోజులుగా ఆమె పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం అవుతున్నట్టు తెలిపారు.

బుధవారం సాయంత్రం ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలిందని సుర్జేవాలా తెలిపారు. బుధవారం సాయంత్రం ఆమెకు స్వల్ప జ్వరం వచ్చిందని వివరించారు. దీంతో ఆమె కరోనా టెస్టు చేసుకున్నారని తెలిపారు. ఈ టెస్టులో ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలిందని అన్నారు. ఆమెకు కొన్ని కరోనా లక్షణాలు ఉన్నాయని, అందుకే ఐసొలేషన్‌లోకి వెళ్లారని చెప్పారు. మెడికల్ కన్సల్టేషన్ పూర్తయిందని, ఆమె ఇప్పుడు కోలుకుంటున్నారని వివరించారు. ఇప్పటి వరకైతే.. ఈడీ ముందు ఆమె హాజరయ్యే తేదీల్లో మార్పు లేదని తెలిపారు.

నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణకు హాజరవ్వాలని ఈడీ బుధవారం సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు నోటీసులు పంపిన సంగతి తెలిసిందే.

Scroll to load tweet…

కాగా, రాహుల్ గాంధీని జూన్ 2వ తేదీ అంటే ఇవాళే హాజరవ్వాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. కానీ, ఆయన విదేశాల్లో ఉన్నట్టు కాంగ్రెస్ నేతలు తెలిపారు. అంతేకాదు, ఈడీ ముందు హాజరు కావడానికి మరికొంత సమయం కావాలని రాహుల్ గాంధీ కోరినట్టు కొన్ని వర్గాలు తెలిపాయి.

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారం నోటీసులు పంపింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ వీరిద్దరికీ నోటీసులు పంపి.. ఏజెన్సీ ముందు హాజరవ్వాలని ఆదేశించింది. నేషనల్ హెరాల్డ్ కేసు మనీ లాండరింగ్‌కు సంబంధించినది. సోనియా గాంధీని ఈ జూన్ నెల 8వ తేదీన, రాహుల్ గాంధీని జూన్ 2వ తేదీన ఏజెన్సీ ముందు హాజరవ్వాలని నోటీసుల్లో ఈడీ పేర్కొంది.

కాంగ్రెస్ నేత అభిషేక్ మను సంఘ్వీ ప్రకారం, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను 8వ తేదీ లోపు ఈడీ ముందు హాజరవ్వాలని ఏజెన్సీ నోటీసులు పంపింది. సోనియా గాంధీ తప్పకుండా ఈడీ ముందు హాజరు అవుతారని, కానీ, రాహుల్ గాంధీ విదేశాల్లో ఉన్నారని ఆయన వివరించారు. అంతలోపు రాహుల్ గాంధీ స్వదేశానికి తిరిగి వస్తే.. తప్పకుండా ఈడీ ముందు హాజరు అవుతారని తెలిపారు. కాగా, ఈడీ ముందు హాజరు కావడానికి రాహుల్ గాంధీ మరి కొంత సమయా న్ని కోరినట్టు ఇండియా టుడే కథనం పేర్కొంది.