సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగా ఉన్నది. క్రమంగా కోలుకుంటున్నారని సర్ గంగారామ్ హాస్పిటల్ తెలిపింది. జనవరి 4వ తేదీన ఆమె రోటీన్ చెకప్ కోసం ఈ హాస్పిటల్‌లో చేరారు.  

న్యూఢిల్లీ: సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగానే ఉన్నది. ఆమె మెల్లగా కోలుకుంటున్నారు. రాయ్‌బరేలీకి పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్న సోనియా గాంధీ రోటీన్ చెకప్ కోసం ఢిల్లీలోని సర్ గంగా రామ్ హాస్పిటల్‌లో జనవరి 4వ తేదీన అడ్మిట్ అయ్యారు. వైరల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ కోసం ఆమె హాస్పిటల్‌లో చేరారు.

సర్ గంగా రామ్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ బోర్డు చైర్మన్ డాక్టర్ అజయ్ స్వరూప్ శుక్రవారం ఓ ప్రకటనలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ సర్ గంగా రామ్ హాస్పిటల్‌లో వైరల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్‌తో చేరారని, ఆమె ఆరోగ్యం ఇప్పుడు నిలకడగా ఉన్నదని తెలిపారు. ఆమె క్రమంగా కోలుకుంటున్నారని వివరించారు.

Also Read: ఆస్ప‌త్రిలో చేరిన సోనియా గాంధీ.. ఆమెవెంట‌ ప్రియాంక గాంధీ.. ఎందుకంటే..?

జనవరి 4వ తేదీన సోనియ గాంధీ చెస్ట్ మెడిసిన్ డిపార్ట్‌మెంట్‌లో అడ్మిట్ అయ్యారని, అప్పటి నుంచి డాక్టర్ అరూప్ బాసు సారథ్యంలోని టీమ్‌ పర్యవేక్షణలో ఉన్నారని, వైరల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ కు చికిత్స పొందుతున్నారు.