కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ న్యూఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు.

కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ న్యూఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. స్వల్ప జ్వరంతో బాధపడుతున్న సోనియా గాంధీ శనివారం సాయంత్రం ఆస్పత్రిలో చేరినట్టుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ప్రస్తుతం సోనియా గాంధీ పరిస్థితి నిలకడగా ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఆమె పరిస్థితిని వైద్యుల బృందం పర్యవేక్షిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక, సోనియా గాంధీ ఇటీవల ఆగస్టు 31న ముంబైలో జరిగిన ప్రతిపక్షాల ఇండియా కూటమి సమావేశానికి హాజరయ్యారు. ఆమె తన కుమారుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో కలిసి ఆ సమావేశానికి హాజరయ్యారు.