కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గురువారం సాయంత్రం ఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. సాధారణ ఆరోగ్య పరీక్షల నిమిత్తమే సోనియా ఆసుపత్రిలో చేరారని, ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆసుపత్రి ఛైర్మన్ డీఎస్ రానా వెల్లడించారు.

హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వడానికి ముందు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులతో సోనియా వర్చువల్ మీటింగ్‌లో పాల్గొన్న సంగతి తెలిసిందే. దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలు, కరోనా పరిస్థితిపై ఆమె చర్చించారు.

కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా సోనియా ఇదే ఆసుపత్రిలో అడ్మిట్ అయిన సంగతి తెలిసిందే. కడుపునొప్పి కారణంగా ఆ సమయంలో ఆమె ఇదే ఆసుపత్రిలో చేరారు.