ఆస్తికోసం కన్నతండ్రినే హతమార్చాలని ప్రయత్నించాడు. తన తండ్రిని చంపాలని ఓ నేరస్థుడి దగ్గరకు సుఫారీ ఇచ్చేందుకు వెళ్లాడు. సుఫారీ భారీగా అడిగారు. కానీ చేతిలో చిల్లిగవ్వ లేదు. తండ్రిని ఎలాగైనా హతమార్చాలనుకున్న లక్ష్యంతో సుఫారీ కోసం దొంగతనాలు మెుదలెట్టాడు. అలా దొంగతనాలు చేస్తూ కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన పూణేలో చోటు చేసుకుంది.
పూణే: ఆస్తికోసం కన్నతండ్రినే హతమార్చాలని ప్రయత్నించాడు. తన తండ్రిని చంపాలని ఓ నేరస్థుడి దగ్గరకు సుఫారీ ఇచ్చేందుకు వెళ్లాడు. సుఫారీ భారీగా అడిగారు. కానీ చేతిలో చిల్లిగవ్వ లేదు. తండ్రిని ఎలాగైనా హతమార్చాలనుకున్న లక్ష్యంతో సుఫారీ కోసం దొంగతనాలు మెుదలెట్టాడు. అలా దొంగతనాలు చేస్తూ కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన పూణేలో చోటు చేసుకుంది.
పూణే నగరానికి చెందిన 20ఏళ్ల మిలింద్ జునావానే అనే యువకుడు తన తండ్రి రమేష్‌ను హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు. రమేష్ మెుదటి భార్య కుమారుడు మిలింద్. మిలింద్ తల్లిని వదిలేసిన రమేష్ రెండో పెళ్లి చేసుకున్నాడు. రమేష్ తనకున్న ఆస్తిని విక్రయించాలనుకున్నాడు. అందుకు మెుదటి భార్య సంతకం కావాలనడంతో ఆమెను సంప్రదించాడు. సంతకం పెట్టేందుకు అంగీకరించలేదు.
తన తల్లిని వేధిస్తున్నాడనే కోపంతో తండ్రి రమేష్ ను హతమార్చాలని మిలింద్ నిర్ణయించుకున్నాడు. కిరాయిహంతకుడు జాదవ్ కు పదిలక్షల రూపాయల నగదు, ఫ్లాటు సుపారిగా ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. కానీ చేతిలో డబ్బులు లేకపోవడంతో దొంగతనాలు మెుదలెట్టాడు. దొంగతనాలు చేసి వచ్చిన డబ్బుతో కారు, పిస్టల్ కొనాలని మిలింద్ ప్రయత్నిస్తుండగా పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు.
పోలీసులు తమదైన శైలిలో ఇంటారాగేట్ చెయ్యగా తండ్రి హత్యకు సుపారీ ఇచ్చేందుకు దొంగతనాలు చేసినట్లు అంగీకరించాడు. నివ్వెరపోయిన పోలీసులు మిలింద్ తోపాటు కిరాయిహంతకుడు జాదవ్ ను అరెస్టు చేశారు. నిందితుల నుంచి రెండు స్మార్ట్ ఫోన్లు, బైక్, ల్యాప్ టాప్ లను స్వాధీనం చేసుకున్నారు. ఐదు దొంగతనాల కేసుల్లో మిలింద్ నిందితుడని పోలీసులు తెలిపారు.
