చెన్నైలోని ట్రైనింగ్ అకాడమీ నుంచి 1995లో స్మితా చతుర్వేది (రిటైర్డ్) ఆర్మీలో చేరారు. ఇప్పడు అదే ట్రైనింగ్ అకాడమీ నుంచి ఆమె కుమారుడు ఆర్మీలో అడుగు పెట్టారు. ఈ విషయాన్ని రక్షణ శాఖ పీఆర్వో చెన్నై విభాగం ట్వీట్ చేసింది. ఈ కథనంపై నెటిజన్ల నుంచి మంచి స్పందన వచ్చింది.
చెన్నై: తల్లి తనయుల ఆదర్శవంతమైన ఘట్టం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. తల్లి బాటలో అడుగులు వేసి ఆమె స్థాయికి చేరుకున్న తనయుడు హాట్ టాపిక్‌గా మారాడు. మేజర్ స్మితా చతుర్వేది (రిటైర్డ్) చెన్నైలోని ఆర్మీ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పొందారు. ఆమె ఈ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసిన 27 ఏళ్ల స్మితా చతుర్వేది తనయుడు కూడా అదే ట్రైనింగ్ అకాడమీ నుంచి ఆర్మీలోకి చేరుతున్నారు. రక్షణ శాఖకు చెందిన చెన్నై పీఆర్‌వో ఈ మేరకు ట్విట్టర్‌లో వెల్లడించింది.
చెన్నైలోని ఆర్మీ ట్రైనింగ్ అకాడమీలో శనివారం పాసింగ్ ఔట్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మేజర్ జనరల్ అబ్దుల్లా షమాల్ సమీక్షించారు.
మేజర్ స్మితా చతుర్వేది (రిటైర్డ్) చెన్నైలోని ట్రైనింగ్ అకాడమీ నుంచి 27 ఏళ్ల క్రితం అంటే 1995లో ఆర్మీలోకి చేరిందని ఆ ట్వీట్ పేర్కొంది. మళ్లీ ఈ ఏడాది ఆమె కొడుకు అదే ట్రైనింగ్ అకాడమీ నుంచి ఆర్మీలోకి చేరుతున్నారని వివరించింది. అదే ట్విట్టర్ హ్యాండిల్ ఆ తర్వాతి ట్వీట్‌లో ట్రైనింగ్ టైమ్‌లో స్మితా చతుర్వేది ఫొటోను పోస్టు చేసింది.
గతంలో కంటే ఇప్పుడు ట్రైనింగ్ అకాడమీలో చాలా మార్పులు వచ్చాయన్న స్మితా చతుర్వేది వీడియోను ఓ ట్విట్టర్ హ్యాండిల్ పోస్టు చేసింది. ఇప్పుడు కొత్త భవనాలు వచ్చాయని, మెస్‌లోనూ చాలా మార్పులు వచ్చాయని వివరించింది. అలాగే.. కొత్త సవాళ్లు కూడా వచ్చాయని, వాటిని ఎదుర్కోవడానికి ఈ యువత ముందడుగు వేస్తున్నారని తెలిపింది. తమ తరం కంటే ఈ నవతరం ఎంతో ముందంజలో ఉన్నదని వివరించింది.
ఈ ట్వీట్లపై నెటిజన్లు ఎంతో ప్రేమపూర్వకంగా స్పందించారు. వారిద్దరి పట్ల గర్వాన్ని ప్రకటించారు. ప్రౌడ్ మూమెంట్ అంటూ ట్వీట్లు చేశారు. ఇద్దరికీ కంట్రాట్స్ చెప్పారు.
