మొబైల్ వ్యసనాన్ని ప్రశ్నించినందుకు తల్లిని కొట్టి చంపిన కొడుకు
మొబైల్ ఫోన్ వ్యసనాన్ని ప్రశ్నించిందనుకు తల్లిని కొడుకు దారుణంగా చంపేశాడు. తలను గోడకేసి పలుమార్లు బాదాడు. దీంతో వారంపాటు హాస్పిటల్‌లో చికిత్స పొంది శనివారం మరణించింది.
తిరువనంతపురం: కేరళలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 63 ఏళ్ల మహిళ తన కొడుకు ఎప్పుడు చూసినా మొబైల్ పట్టుకునే ఉంటున్నాడని ఆగ్రహించింది. మొబైల్ వ్యసనాన్ని ప్రశ్నించింది. దీంతో కోపోద్రిక్తుడైన ఆ కొడుకు తల్లి తలను గోడకేసి ఘోరంగా బాదాడు. సుమారు ఒక వారం పాటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ పరిస్థితులు విషమించి శనివారం మరణించింది. ఈ ఘటన కాసర్‌గోడ్ జిల్లాలో కాంనిచిరాలో జరిగింది.
కొడుకు మొబైల్ ఫోన్ వ్యసనానికి లోనయ్యాడని గమనించిన తల్లి రుగ్మిని కొడుకు సుజీత్‌ను ప్రశ్నించింది. మొబైల్ వాడొద్దని ఆగ్రహించింది. దీంతో కొడుకు వాయిలెంట్‌గా రియాక్ట్ అయ్యాడు. తల్లి తలను గోడకేసి పలుమార్లు బాదాడు.
ఈ ఘటన జరిగిన వెంటనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తులో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. తాను మొబైల్ ఫోన్ తరుచూ వాడుతున్నందున తల్లి ప్రశ్నించిందని, ఆగ్రహంతో తల్లిపై దాడి చేసినట్టు ఒప్పుకున్నాడు.
Also Read: సివిల్ సర్వీస్‌కు ప్రిపేర్ అయ్యేవారికి రూ. 7,500 స్టైపండ్ అందిస్తాం: మంత్రి ఉదయనిధి
నిందితుడి మానసిక ఆరోగ్యం సరిగా లేదు. దీంతో ఆయనను కోళికోడ్‌లో కుతిరవట్టోమ్‌లోని ప్రభుత్వ మెంటల్ హాస్పిటల్‌లో చేర్చినట్టు పోలీసులు తెలిపారు.