Asianet News TeluguAsianet News Telugu

పంజాబ్‌: సిద్ధూకు మద్ధతుగా మంత్రి రజియా రాజీనామా.. ఇదే బాటలో మరికొందరు..?

పంజాబ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. మంత్రి పదవికి రజియా సుల్తానా రాజీనామా చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీకి రాజీనామా లేఖను పంపారు. అయితే ఆమె బాటలో మరికొందరు మంత్రులు వున్నట్లుగా తెలుస్తోంది. 

Solidarity With Navjot Sidhu says Punjab Minister Razia Sultana Resigns
Author
Chandigarh, First Published Sep 28, 2021, 8:02 PM IST

పంజాబ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. మంత్రి పదవికి రజియా సుల్తానా రాజీనామా చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీకి రాజీనామా లేఖను పంపారు. అయితే ఆమె బాటలో మరికొందరు మంత్రులు వున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పీసీసీ చీఫ్ పదవికి నవ్‌జోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అలాగే పంజాబ్ పీసీసీలో ట్రెజరర్‌గా విధులు నిర్వర్తిస్తున్న గుల్జార్ ఇందర్ సైతం రాజీనామా చేశారు. 

కాగా, ఈ ఏడాది జూలై 18న పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి, మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ నియమితులయ్యారు. పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడిగా సిద్ధూని నియమిస్తున్నట్టు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రకటించారు. సిద్ధూతో పాటు మరో నలుగురిని కార్యనిర్వాహక అధ్యక్షులుగా నియమిస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఉత్తర్వులు వెలువరించారు. ఆయన నియామకం ద్వారా ఎన్నికలకు 6 నెలల ముందు హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లయ్యింది. 

ALso Read:పంజాబ్ రాజకీయాల్లో అనూహ్య మలుపు: పీసీసీ చీఫ్ పదవికి సిద్ధూ రాజీనామా

సిద్ధూకు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించే అంశంపై ఇటీవల తీవ్ర చర్చ జరిగింది. పార్టీ అధిష్ఠానం సుముఖంగా ఉన్నప్పటికీ అప్పటి సీఎం అమరీందర్‌ సింగ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏకంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఓ లేఖను కూడా రాశారు. పంజాబ్ విషయంలో అధిష్టానం మితిమీరిన జోక్యం చేసుకుంటోందని సీనియర్లను విస్మరించారని లేఖలో దుయ్యబట్టారు. ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి పార్టీకి కష్టమేనని మాజీ సీఎం తెగేసి చెప్పారు. అయితే రాష్ట్ర పార్టీలోని పరిణామాల నేపథ్యంలో అమరీందర్ సెప్టెంబర్ 18న ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios