Asianet News TeluguAsianet News Telugu

Army Helicopter Crash : హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఒకేఒక్కడు ఈయనే...

ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో కేవలం ఒకే ఒక్కరు ప్రాణాలతో బయటపడ్డారు. ఆయనే గ్రూప్ కెప్టెన్  వరుణ్ సింగ్. తీవ్రంగా గాయపడిన ఆయన వెల్లింగ్టన్ లోని మిలటరీ ఆస్సత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. వరుణ్ సింగ్ ఇండియన్ ఆర్మీ లో విశేష సేవలందించారు.  ఈ ఏడాది ఆగస్టులోనే భారత ప్రభుత్వం వరుణ్ సింగ్ ను శౌర్యచక్ర అవార్డుతో సత్కరించింది.

sole survivor of IAF chopper crash group captain varun singh
Author
Hyderabad, First Published Dec 9, 2021, 8:12 AM IST

చెన్నై :  Army helicopter ప్రమాదవశాత్తు కుప్పకూలిన ఘటనలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)జనరల్ Bipin Rawat దంపతులతో పాటు మరో 11 మంది కన్నుమూశారు. హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్న 14మంది లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఒకే ఒక్కరు ప్రాణాలతో బయటపడ్డారు. ఆయనే గ్రూప్ కెప్టెన్  
Varun Singh.  

తీవ్రంగా గాయపడిన ఆయన వెల్లింగ్టన్ లోని Military Hospitalలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. వరుణ్ సింగ్ ఇండియన్ ఆర్మీ లో విశేష సేవలందించారు.  ఈ ఏడాది ఆగస్టులోనే భారత ప్రభుత్వం వరుణ్ సింగ్ ను 
Shaurya Chakra Awardతో సత్కరించింది. గతేడాది  తాను నడుపుతున్న యుద్ధ విమానంలో సాంకేతిక సమస్యలు  తలెత్తినప్పటికీ..  ధైర్య సాహసాలు, నైపుణ్యాన్ని ప్రదర్శించి  ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా ల్యాండ్ చేశారు.

తమిళనాడులోని కోయంబత్తూరు, కూనూరు మధ్యలో హెలికాప్టర్ కూలిపోయిన ఘటనలో cds  జనరల్ bipin rawat,  ఆయన భార్య మధులిక రావత్ తో పాటు 11 మంది మృతిచెందారు. వెల్లింగ్టన్ లోని డిఫెన్స్ కాలేజీలో లెక్చర్ ఇచ్చేందుకు ఈ ఉదయం రావత్ దంపతులు, ఆర్మీ అధికారులతో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి తమిళనాడు కి వెళ్లారు.

మధ్యాహ్నం 12 గంటల సమయంలో సూలూరు ఎయిర్ బేస్ నుంచి ఆర్మీ హెలికాప్టర్ లో వెల్లింగ్టన్ వెళ్తుండగా ప్రమాదవశాత్తు కుప్పకూలింది. ఈ ఘటనలో హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న 14మందిలో 13 మంది మృతి చెందినట్లు వాయుసేన అధికారికంగా ధ్రువీకరించింది. కాగా రావత్ సహా ఆర్మీ అధికారుల మృతి పట్ల ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సహా పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

bipin rawat: చదువుకున్న చోటకెళ్తూ.. కానరాని లోకాలకు, విషాదంలో వెల్లింగ్టన్ డిఫెన్స్ కాలేజ్

ఇదిలా ఉండగా,  చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) జనరల్ బిపిన్ రావత్‌తో ప్రయాణిస్తున్న భారత వైమానిక దళం (ఐఎఎఫ్) హెలికాప్టర్ బుధవారం తమిళనాడులోని కూనూరు సమీపంలో కూలిపోయింది. ఈ స‌మ‌యంలో  సిడిఎస్‌ బిపిన్ రావత్ తో పాటు ఆయన సతీమణి మధులికా రావత్, ఆయన సిబ్బంది, ఇతర అధికారులు  ప్ర‌యాణిస్తోన్నారు. ఈ ప్ర‌మాదంలో ది చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ బిపిన్ రావత్ కన్నుమూశారు.ఆయ‌న‌తో పాటు 13 మంది కన్నుమూశారు.  మృతిచెందిన వారిలో బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక కూడా ఉన్నారు.  

హెలికాప్టర్‌ కూలిన వెంట‌నే మంటలు చెలరేగాయి. దీంతో  వెంట‌నే హెలికాప్టర్ క్రాష్ అయింది. 14 మందిలో ఏకంగా 11 మంది స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారు 80 శాతం కాలన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయ‌న కాలిన గాయాల తీవ్రత ఎక్కువ ఉండటంతో అత్యవసర చికిత్స అందిచినప్పటికీ ఆయన కన్నుమూశారు.  బిపిన్ రావ‌త్ మ‌ర‌ణ వార్త‌ను వాయుసేన అధికారికంగా ధృవీక‌రిస్తూ.. సాయంత్రం 6 గంట‌ల‌కు ట్వీట్ చేసింది.
 
గ‌తంలో రావత్ ఛాపర్ ప్రమాదం నుండి బయటపడ్డారు. ఫిబ్రవరి 3, 2015న నాగాలాండ్‌లోని దిమాపూర్‌లో చీతా ప్రమాదం నుంచి రావత్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ సమయంలో రావ‌త్  లెఫ్టినెంట్ జనరల్ గా పని చేస్తున్నారు. దిమాపూర్‌లో టేకాఫ్‌ అయిన కొద్ది నిమిషాలకే చాపర్‌ కూలిపోయింది. చాఫ‌ర్  ఇంజిన్ స‌మ‌స్య‌లు త‌లెత‌డంతో ఆ స‌మ‌యంలో ప్రమాదం జ‌రిగింది.  ఆ ప్ర‌మాదంలో ఇద్దరు పైలట్లు,  ఒక కల్నల్ కూడా సురక్షితంగా బయటపడ్డారు. జనరల్ రావత్‌ కు అప్పుడు స్వల్ప గాయాలయ్యాయి. కానీ, నేడు జ‌రిగిన ప్ర‌మాదంలో వీరా మ‌ర‌ణం చెందారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios