న్యూఢిల్లీ: కుటుంబంతో ఈద్ పర్వదినం వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఓ సైనికుడు అదృశ్యమయ్యాడు. నిన్న సాయంత్రం నుండి ఆయన తప్పిపోయినట్టుగా సైన్యం ప్రకటించింది.162 రైఫిల్ బెటాలియన్ లో రైఫిల్ మెన్ షకీర్ మంజూరు సెలవుపై షాపియాన్ ఇంటికి వెళ్లాడు.  అతడిని ఉగ్రవాదులు అపహరించినట్టుగా సైన్యం అనుమానిస్తోంది.

టెర్రరిజం ఫ్రీ కాశ్మీర్ అనే హ్యాష్ ట్యాగ్ కింద సైన్యం ట్వీట్ చేసింది. 162 బెటాలియన్ (టిఎ)కు చెందిన రైఫిల్మాన్ షకీర్ మంజూరు నిన్నటి నుండి అదృశ్యమైనట్టుగా సైన్యం ప్రకటించారు. అతను ప్రయాణించిన కారు కుల్గాం సమీపంలో కన్పించింది. కారు దగ్ధమైంది.. ఉగ్రవాదులు సైనికుడిని ఉగ్రవాదులు అనుమానిస్తున్నారు.

తప్పిపోయిన సైనికుడి కోసం అనంతనాగ్, షోపియన్, కుల్గాం జిల్లాల్లో పోలీసులు, డ్రోన్లు, స్నిఫర్ డాగ్స్ తో గాలిస్తున్నారు.మంజూరును సురక్షితంగా అప్పగించాలని కుటుంబసభ్యులు టెర్రరిస్టులను కోరారు. 2017లో ఆర్మీ అధికారి షాపియాన్ లో పెళ్లికి హాజరైన సమయంలో ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. వివాహ వేదిక నుండి రోజూ 30 కి.మీ. దూరంలో కిడ్నాప్ కు గురైన ఉమ్మర్ ఫయాజ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొన్నారు.

22 ఏళ్ల ఈ యువకుడు ఐదు నెలలకు ముందు రాజ్ పుతానా రైఫిల్స్ లో చేరాడు. 1991 నుండి తన స్వంత రాష్ట్రంలో సెలవులో ఉన్నప్పుడు హత్యకు గురయ్యాడు.
2018 జూన్ లో ఈద్ కోసం పూంచ్ లోని తన ఇంటికి వెళ్లిన మరో సైనికుడు రంగజేబ్ ను టెర్రరిస్టులు కిడ్నాప్ చేసి చంపారు.