ఈ నెల 23న సాయంత్రం చంద్రుడిపై చంద్రయాన్-3 ల్యాండర్ కానుంది. ఏదైనా అవాంతరాలు  వస్తే  ల్యాండింగ్ ను  ఈ నెల  27వ తేదీకి వాయిదా వేయనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. 


న్యూఢిల్లీ:ఈ నెల 23న సాయంత్రం 6:04 గంటలకు చంద్రయాన్-3 ల్యాండర్ చంద్రుడిపై ల్యాండ్ కానుంది. సెకనుకు 1.68 కి.మీ స్పీడుతో ప్రయాణించనుంది.25-30 కి.మీ ఎత్తు నుండి చంద్రుడిపై ల్యాండర్ దిగనుందని ఇస్రో ప్రకటించింది. చంద్రయాన్-2 ఆర్బిటర్ తో చంద్రయాన్ -3 లింక్ అయిందని ఇస్రో ప్రకటించింది. రేపు ల్యాండర్ ల్యాండింగ్ కాకపోతే ఈ నెల 27కు ల్యాండింగ్ ను వాయిదా వేయనున్నట్టుగా ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు.

చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగే అత్యంత కీలక దశగా ఇస్రో ప్రకటించింది. ల్యాండర్ మాడ్యూల్లో ఏ ఒక్క తేడా కన్పించినా ల్యాండింగ్ ను వాయిదా వేస్తామని ఇస్రో తేల్చి చెప్పింది.చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి ఇక్కడ కీలకమని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఏ చిన్న తేడా జరిగినా క్రాష్ ల్యాండింగ్ అయ్యే అవకాశం ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు.చంద్రుడిపై ల్యాండర్ ల్యాండింగ్ ను ప్రత్యక్ష ప్రసారం చేస్తామని ఇస్రో తెలిపింది.చంద్రయాన్-2 లో చంద్రుడి ఉపరితలంపై 2.1 కి.మీ ఎత్తుకు చేరుకున్న తర్వాత ఇస్రోతో ల్యాండర్ కమ్యూనికేషన్ కోల్పోయింది. చంద్రయాన్-2 లో చోటు చేసుకున్న లోపాలను సవరించుకుంటూ చంద్రయాన్-3 ను ప్రారంభించింది. చంద్రయాన్-3 లో కీలక దశకు చేరుకుంది.

also read:జాబిల్లిపై సేఫ్ ల్యాండింగ్ కు ప్రయత్నిస్తున్న చంద్రయాన్-3..ఎల్ హెచ్ డీఏసీ తీసిన తాజా ఫొటోలు విడుదల చేసిన ఇస్రో

ఈ ఏడాది జూలై 14న చంద్రయాన్-3 ని ప్రయోగించింది ఇస్రో. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ఇస్రో శాస్త్రవేత్తలు కసరత్తు చేస్తున్నారు.చంద్రుడికి అత్యంత సమీపంలోకి ల్యాండర్ వెళ్లింది. రేపు సాయంత్రం ల్యాండర్ చంద్రుడిపై ల్యాండింగ్ కోసం శాస్త్రవేత్తలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరో వైపు చంద్రుడికి సంబంధించిన కొన్ని ఫోటోలను ల్యాండర్ లోని కెమెరా ఇస్రోకు చేరవేసింది. ఈ ఫోటోలను ఇస్రో ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన విషయం తెలిసిందే.