ప్రస్తుతం కరోనా కాలం నడుస్తోంది. ఎక్కడ చూసినా ఈ కరోనా గురించే వినాల్సి వస్తోంది. దీని కారణంగా ఎప్పుడు ఎక్కడ ఎవరు ప్రాణాలు కోల్పోతున్నారో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఈ కరోనా ప్రభావం ప్రస్తుతం పెళ్లిళ్లపై కూడా పడింది. మంచి ముహూర్తాలు ఉండటంతో.. తక్కువ మంది అతిథులతో పెళ్లి వేడుకలు నిర్వహిస్తూనే ఉన్నారు. కరోనా ఎంతకాలం ఉంటుందో తెలీదు.. దాని కోసం పెళ్లి ఆపడం ఇష్టం లేక కొందరు చేసుకుంటూనే ఉన్నారు.

ఈ పెళ్లి కారణంగా ఎవరికీ కరోనా ఎటాక్ చేయకుండా ఉండేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా ఓ జంట తమ పెళ్లిలో..సామాజిక దూరం పాటించారు. వధూవరులు దూరంగా ఉంటూనే పెళ్లి తంతు నిర్వహించారు.  కర్రలకు పూల దండలు వేసి.. దాని ద్వారా దండలు మార్చుకోవడం విశేషం. ఈ సంఘటన బిహార్ లో చోటుచేసుకోగా.. ఈ వెరైటీ పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

క‌రోనా కాటుకు గురి కాకుండా ఉండాలంటే మాస్క్ పెట్టుకోవడం, సోష‌ల్ డిస్టెన్స్ పాటించడం త‌ప్ప‌నిస‌రి. అందుకే ఈ నియ‌మాల‌ను పాటిస్తూ వ‌ధూవ‌రులిద్ద‌రూ చెరో రెండు క‌ర్ర‌లు తీసుకుని, వాటికి దండ‌లు త‌గిలించి పర‌స్ప‌రం మార్చుకున్నారు. ఈ సందర్భంగా వ‌రుడు మాట్లాడుతూ సోష‌ల్ డిస్టెన్స్ పాటిస్తూ, జ‌రిగిన ఈ వివాహం త‌మ‌కు జీవితాంతం గుర్తుండిపోతుంద‌న్నారు. క‌ర్ర‌ల‌తో దండ‌లు మార్చుకునే తంతు ఎంతో న‌చ్చింద‌న్నారు. కాగా ఈ వివాహానికి 50 మంది అతిథులు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. ఈ క‌రోనా సీజ‌న్ వివాహం బీహార్‌లోని తెఘ్డా ప‌రిధిలోని తెఘ్రా బజార్‌లో జ‌రిగింది. ఏప్రిల్ 30న కృతేష్ కుమార్, జ్యోతిల వివాహంలో ఈ దృశ్యాలు క‌నిపించాయి.