ఇటీవల ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను హత్య చేసి.. అనంతరం అక్కడి నుంచి అత్తగారింటికి వెళ్లి అక్కడ అత్తను కూడా చంపేసి... అనంతరం ఆత్మహత్య చేసుకున్న సంఘటన తెలిసిందే. అయితే.. అతను తన భార్యను చంపేందుకు దాదాపు ఆరు నెలలుగా పథకం వేసినట్లు అతను రాసిన సూసైడ్ నోట్ లో తెలిసింది.

పాముతో కరిపించి, రౌడీలకు సుపారీ ఇచ్చి వారితో హత్య చేయించి, కారుతో  యాక్సిడెంట్  చేయించాలని.. ఇలా చాలా రకాలు గా ప్లాన్స్ వేసి.. తర్వాత ఎవరి మీదా నమ్మకం లేక.. తానే స్వయంగా చంపాలని ఫిక్స్ అయ్యాడు. ఆ తర్వాత తన భార్యను హత్య చేసినట్లు అతను సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. దాదాపు 67 పేజీలతో సూసైడ్ నోట్ రాయడం గమనార్హం. దానికి మహాభారత్ ఆఫ్ మై లైఫ్ అని పేరు కూడా పెట్టడం విశేషం.

పూర్తి వివరాల్లోకి వెళితే... 

అమిత్ అగర్వాల్(42) చార్టెడ్ ఎకౌంటెంట్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి కొన్ని సంవత్సరాల  క్రితం శిల్పి ధందానియాతో వివాహమైంది. వీరికి పదేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. కాగా.. వీరు బెంగళూరులో నివసిస్తున్నారు. గత కొద్దికాలంగా భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో వారు విడాకులు కూడా తీసుకుందామని అనుకుంటున్నారు. కాగా.. అమిత్ ఇటీవల తన భార్య శిల్పిని కాల్చి చంపేశాడు. 

అక్కడి నుంచి విమానంలో కొడుకుతో కలిసి కోల్ కతా చేరుకున్నాడు. అక్కడ తన కుమారుడికి తన స్నేహితుడికి అప్పగించి.. తన సోదరి ఇంటికి చేర్చాలని కోరాడు. అనంతరం వెంటనే అక్కడి నుంచి తన భార్య పుట్టింటికి వెళ్లాడు. అక్కడ అత్త, మామలతో చాలా సేపు గొడవ పడ్డాడు. అనంతరం తన వెంట తెచ్చుకున్న తుపాకీతో భార్య తల్లి లలిత దందానియాను పాయింట్ బ్లాక్ లో గన్ పెట్టి కాల్చి చంపేశాడు.

అల్లుడు చేసిన షాకైన మామ వెంటనే తేరుకొని ఇంటికి బయట గడియ పెట్టి.. పరుగులు తీశాడు.

 వెంటనే వెళ్లి ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. వారు వచ్చి చూసే సరికి  అమిత్ కూడా శవమై కనిపించాడు. అత్తగారిని చంపిన తర్వాత తనను తాను కాల్చుకొని చనిపోయినట్లు  తెలుస్తోంది.

అతని పక్కనే సూసైడ్ లెటర్ కూడా ఉంది. అందులో తాను కోల్ కతా రాకముందే బెంగళూరులో భార్యను చంపినట్లు రాసి ఉంచాడు. వెంటనే పోలీసులు అప్రమత్తమై.. బెంగళూరులోని అతని ఇంట్లో సోదాలు చేయగా.. అక్కడ అమిత్ భార్య శిల్పి చనిపోయి ఉంది. 

కాగా.. పోలీసుల దర్యాప్తులో చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత రెండు సంవత్సరాలుగా భార్యభర్తలు విడివిడిగా ఉంటున్నారు. విడాకులు కూడా తీసుకోవాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే భార్యను కిరాయి గుండాలతో చంపించాలని  లాక్ డౌన్ ముందు బిహార్ వెళ్లాడు. ఆ తర్వాత పాముతో కాటు వేయించాలని తమిళనాడు వెళ్లాడు. కారుతో యాక్సిడెంట్ చేసి చంపాలని కూడా ప్లాన్ వేశాడు. కానీ తర్వాత ఆలోచన మార్చుకొని తానే స్వయంగా చంపినట్లు సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు.