Asianet News TeluguAsianet News Telugu

ట్రాఫిక్ జామ్ లో ఇర్కుకున్న మంత్రి స్మృతి ఇరానీ.. ఖాళీగా కూర్చోకుండా అలా గడిపారు.. నెట్టింట్లో వీడియో వైరల్ 

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కున్న కేంద్ర మంత్రి తన కారులో ఖాళీగా కూర్చోకుండా.. సరాదాగా స్వెటర్ అల్లుతున్నారు. ఓ మంచి క్యాప్షన్ పెట్టి నెట్టింట్లో పోస్టు చేశారు. 

Smriti Irani Stuck In A Jam Between Lucknow Kanpur Spent Time Weaving Sweaters In Car
Author
First Published Oct 22, 2022, 11:15 PM IST

నెట్టింట్లో చాలా యాక్టివ్ గా ఉండే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ.. ఆమె తరచుగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికరమైన పోస్ట్‌లను పంచుకుంటారు. సరదా విషయాల నుంచి ప్రేరణాత్మక కంటెంట్ వరకు అనేక రకాల విషయాలను ఆమె నెట్టింట్లో పంచుకుంటారు. మీరు ఆమె ఇన్‌స్టా-హ్యాండిల్‌ను స్క్రోల్ చేస్తే.. ఆమె ప్రతిసారీ వివిధ రకాల పోస్ట్‌లు మరియు కథనాలను షేర్ చేస్తున్నట్లు మీరు గమనించవచ్చు.

తాజాగా ఆమె తన ఇన్‌స్టా వేదికగా ఓ వీడియో షేర్ చేశారు. లక్నో-కాన్పూర్ మధ్య ట్రాఫిక్ జామ్‌లో కేంద్ర మంత్రి కాన్వాయ్ చిక్కుకుంది. అక్కడే చాలా సమయంలో వేచి ఉండాల్సి వచ్చింది. ఈ సమయంలో ఆమె సరదాగా ఓ పని చేస్తూ కనిపించింది. ఓ  మంచి క్యాప్షన్ పెట్టి నెట్టింట్లో పోస్టు చేసింది. ఇందుకు సంబంధించిన  వీడియో నెట్టింట్లో  తెగ వైరల్ అవుతోంది. 

సమాచారం ప్రకారం.. కేంద్ర మంత్రి కాన్వాయ్ లక్నో మరియు కాన్పూర్ మధ్య ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుంది. ఈ సమయంలో లాంగ్ జామ్ కావడంతో మంత్రి చాలాసేపు అక్కడే ఇరుక్కుపోయారు. సమయం గడపడానికి మంత్రి స్వెటర్లు అల్లడం ప్రారంభించారు. ఈ వీడియోను స్వయంగా కేంద్ర మంత్రి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. క్యాప్షన్ కూడా రాశారు.

జీవితంలోని చిన్న చిన్న ఆనందాలు ఎక్కువ కాదు... చిన్న చిన్న క్షణాలలో జీవితాన్ని గడపండి, చిన్న చిన్న విషయాలను ఆస్వాదించండి..చిన్న విషయాల్లోనే ఆనందం వెతుక్కోవాలి.. అదేవిధంగా లక్నో-కాన్పూర్ మధ్య ట్రాఫిక్ జామ్ సమయంలో కొంతసేపు ఇలాగే గడిపాను. అని రాసుకోచ్చారు.  

మంత్రి ఇరానీ పోస్ట్‌పై రకరకాల ఆసక్తికర కామెంట్స్ వచ్చాయి. ఒక నెటిజన్ ఇలా వ్రాశారు. ఈ రోజుల్లో ఎవరూ ఈ పని చేయరు.. మీరు నాకు 2000 సంవత్సరం నాటి చిన్ననాటి రోజులను గుర్తు చేశారు. నిగమ్ సోనాల్ అనే మరో వినియోగదారు ఇలా వ్రాశారు - ఈ విధంగా ట్రాఫిక్ రెండు నగరాలను కలుపుతోంది.. త్వరలో పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాను అని కామెంట్ చేశారు.

మరొక ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారు సురేంద్ర జాంగర్ ఇలా వ్రాశారు - ఈ విధంగా అల్లడం చూస్తే.. మీరు నగరంలో పెరగలేదని, ఒక గ్రామంలో పెరిగారని తెలుస్తోంది. ఇలా నెటిజన్లు విభిన్న కామెంట్స్ చేశారు. 

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మంచి పార్లమెంటేరియన్ మాత్రమే కాదు, తన వ్యక్తిగత జీవితంలో చురుకైన వ్యక్తి. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన మూమెంట్స్ ను పంచుకుంటూ ఉంటారు. స్మృతి ఇరానీ తన రోజువారీ జీవితంలోని స్లైస్‌ల నుండి తన వర్క్ అప్‌డేట్‌ల వరకు - స్మృతి ఇరానీ తన 1.2 మిలియన్ల ఫాలోవర్లతో వాటన్నింటినీ షేర్ చేసుకుంటారు. 

Follow Us:
Download App:
  • android
  • ios