Asianet News TeluguAsianet News Telugu

ప్రపంచంలోని అతి చిన్నపార్టీ..  అతిపెద్ద పార్టీని ఓడించింది: అప్ ఎంపీ రాఘవ్ చద్దా

ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (MCD)కి జరిగిన ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. కేంద్రంలో అధికారం.. రాజధానిలో 15 సంవత్సరాల అధికార ప్రస్థానం ఉన్న  బిజెపిని మట్టికరిపించింది. ఊహించిన దానికంటే త్వరగా జరిగిన ఎన్నికలలో AAP ప్రతిష్టాత్మక విజయాన్ని సాధించిందని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపి రాఘవ్ చద్దా  అన్నారు
 

Small Party Beat World Biggest  Says AAP s Raghav Chadha
Author
First Published Dec 7, 2022, 4:09 PM IST

ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (MCD)కి జరిగిన ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ చారిత్రాత్మక విజయాన్ని సాధించిందని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపి రాఘవ్ చద్దా  అన్నారు. ఢిల్లీలో 15 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీజేపీని  మట్టికరిపించిందని పేర్కొన్నారు. ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించేందుకు బీజేపీ అన్ని విధాలా ప్రయత్నించిందనీ, అయితే.. అవి ఏవీ కుదరలేదని రాఘవ్ చద్దా ఆరోపించారు.

అపరిమితమైన శక్తి ఉన్న బీజేపీ కుయుక్తులు నేరవేరలేదనీ, బీజేపీ దాని ముఖ్యమంత్రులు, వారి చేతిలో ఉంటే దర్యాప్తు సంస్థలు కలిసిన ప్రపంచంలోని అత్యంత చిన్న పార్టీ ఓడించలేకపోయారని ఎద్దేవా చేశారు. ఫైనల్ గా అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని యువ బృందం విషయం సాధించిందని అన్నారు. నేడు  ఒక చిన్న పార్టీ, పేద, నిజాయితీ, విద్యావంతులైన పార్టీ, ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీని ఓడించిందనీ, ఇది బిజెపి, ఆప్‌ల మధ్య జరిగిన పోరు అని చద్దా అన్నారు.

బిజెపి ఏడుగురికి పైగా ముఖ్యమంత్రులను, 17 మందికి పైగా ముఖ్యమంత్రిని, 100 మందికి పైగా ఎంపిలను తీసుకువచ్చింది, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సిబిఐ, ఆదాయపు పన్ను శాఖ, జైలులో ఉన్న దోపిడిని [సుకేష్ చంద్రశేఖర్] స్టార్ క్యాంపెయినర్‌గా చేసింది. వారు అరవింద్ కేజ్రీవాల్‌ను ఎలాగైనా ఆపాలనుకున్నారు. కానీ ఢిల్లీ ప్రజలు మాత్రం బీజేపీని కాదనీ ఆప్ చేతికి అధికారం అప్పగించారని అన్నారు. 

మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీలోకి ఆప్ అడుగు పెట్టాలని ఢిల్లీ ప్రజలు నిర్ణయించుకున్నారని అన్నారు. అయితే.. ఢిల్లీని బీజేపీ చెత్తతో కప్పిందని, దానిని శుభ్రం చేస్తామని అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ యొక్క మొదటి, రాజ్యాంగ బాధ్యత పరిశుభ్రత అని చాడ చెప్పారు. ఢిల్లీ ఎన్నికల్లో ప్రపంచంలోనే అతి చిన్న పార్టీ ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీని ఓడించిందని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఢిల్లీ మేయర్ కాబోతున్నారు.  ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీపై ఉన్న తమ అభిమానాన్ని చాటుకున్నారని పేర్కొన్నారు. 

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీడీ) ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ  పార్టీ విజయం సాధించింది. మొత్తం 250 వార్డులకు ఆదివారం రోజున పోలింగ్ జరగగా... బుధవారం  ఓట్ల  లెక్కింపు చేపట్టారు. ఆప్‌ ఏకంగా 134 వార్డులను గెలుచుని ఢిల్లీ మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఈ ఘన విజయంతో ఢిల్లీ కార్పోరేషన్ లో గత 15 ఏండ్ల బీజేపీ పాలనకు ముగింపు పడింది.  బీజేపీ  103 స్థానాల్లో విజయం సాధించింది. ఆప్,బీజేపీ ల మధ్య గట్టిపోటీనే నెలకొందని చెప్పాలి. చివరి వరకు హోరాహోరీ పోరు సాగింది. ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఫూర్తిగా పడిపోయింది. కేవలం 10 వార్డుల్లోను మాత్రమే గెలుచుకుంది. ఇక ఇతరులు మూడు స్థానాల్లో విజయం సాధించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios