Asianet News TeluguAsianet News Telugu

యువతకు మెరుగైన భవిష్యత్తు కల్పించడమే స్కిల్ ఇండియా డిజిటల్ లక్ష్యం : కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్

Skill India Digital: "స్కిల్ ఇండియా డిజిటల్ యువతకు భవిష్యత్ కు అనువైన నైపుణ్యాలతో వారి స్కిల్స్ ను పెంపొందించడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్న శక్తివంతమైన పథకం. ఇది అనేక అవకాశాలను సృష్టించడానికి సహాయపడుతుంది. కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ నైపుణ్యాల విషయంలో ప్రాధాన్యతగా మారింది. స్కిల్ ఇండియా డిజిటల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ అండ్ ఫ్యూచ‌ర్ రెడీ ఉన్న శ్రామిక శక్తిని అనుమతిస్తుంది" అని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్ అన్నారు.
 

Skill India digital aims is provide a better future to the youth: Union Minister Rajeev Chandrasekhar RMA
Author
First Published Sep 14, 2023, 12:33 PM IST

Union Minister Rajeev Chandrasekhar: యువతకు మెరుగైన భవిష్యత్తును సృష్టించడమే స్కిల్ ఇండియా డిజిటల్ (సిడ్) సమగ్ర డిజిటల్ ప్లాట్ ఫామ్ ల‌క్ష్య‌మ‌ని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో స్కిల్ ఇండియా డిజిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాజీవ్ చంద్రశేఖర్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొన్నారు. అనంతరం చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ.. యువతకు మంచి భవిష్యత్తును సృష్టించే లక్ష్యంతో స్కిల్ ఇండియా డిజిటల్ అనే మరో డిజిటల్  పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) ను ప్రారంభించామన్నారు. డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా రెండూ మన ప్రధాన మంత్రి  విజన్ లనీ, ఇవి దేశ యువతకు మంచి భవిష్యత్తును సృష్టించడానికి ఉద్దేశించినవి తెలిపారు.

"స్కిల్ ఇండియా డిజిటల్ అనేది డిజిటల్ ఇండియా కార్యక్రమం. స్కిల్ ఇండియా కార్యక్రమంలో ఉన్న ఒక ప్ర‌ధాన‌ వేదిక. ఇది ఖచ్చితంగా అత్యంత మారుమూల యువ భారతీయులకు కూడా నైపుణ్యాలను అందించే సామర్థ్యా, నైపుణ్యాల ప్రాప్యతను కలిగి ఉంటుందని" కూడా మంత్రి తెలిపారు. స్కిల్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ మంత్రిత్వ శాఖ ప్రకారం..ఎస్ఐడీ అనేది భారతదేశ నైపుణ్యం, విద్య, ఉపాధి, వ్యవస్థాపక పర్యావరణ వ్యవస్థ కోసం డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ). డిజిటల్ టెక్నాలజీ అండ్ ఇండస్ట్రీ 4.0 నైపుణ్యాలపై దృష్టి సారించి, నైపుణ్య అభివృద్ధిని మరింత సృజనాత్మకంగా, అందుబాటులోకి తీసుకురావ‌డం, వ్యక్తిగతీకరించాలనే దార్శనికతతో నడిచే ఈ అత్యాధునిక వేదిక.. నైపుణ్యం కలిగిన ప్రతిభావంతుల నియామకాన్ని వేగవంతం చేయడంలో, జీవితకాల అభ్యాసం-కెరీర్ పురోగతిని సులభతరం చేయడంలో ఒక ముంద‌డుగు అవుతుంది.

"డిజిటల్ నైపుణ్యాలు, డిజిటల్ అక్షరాస్యతను ప్రోత్సహించడానికి డీపీఐ, డిజిటల్ ఎకానమీని నిర్మించడానికి జీ-20 ఫ్రేమ్ వ‌ర్క్ లో వ్యక్తీకరించిన విజన్ కు ఈ ప్లాట్ ఫామ్ సరిగ్గా సరిపోతుంది. ఇది అన్ని ప్రభుత్వ నైపుణ్యాలు-వ్యవస్థాపకత చొరవలకు సమగ్ర సమాచార గేట్ వే.. కెరీర్ పురోగతి, జీవితకాల అభ్యాసం కోసం పౌరులకు ఒక హబ్" అని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ స్కిల్ ఇండియా డిజిటల్ అన్ని నైపుణ్య కార్యక్రమాలను ఏకతాటిపైకి తీసుకురావడానికి అత్యాధునిక వేదిక అని అన్నారు. గ్లోబల్ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తో పాటు నైపుణ్యాల అంతరాలను పరిష్కరించడానికి భారతదేశం జీ20 ప్రెసిడెన్సీకి ఏకాభిప్రాయం తీసుకురావ‌డం కీల‌కమలుపుగా పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios