Asianet News TeluguAsianet News Telugu

మూతపడ్డ లిఫ్ట్ లో మిస్టరీ.. 24 యేళ్ల తరువాత తెరిచిన లిఫ్ట్ లో ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం...!

ఉత్తరప్రదేశ్ కైలీలోని ఈపీసీఈ ఆస్పత్రిని 1991లో నిర్మించారు. అందులోని లిఫ్ట్ కొద్దికాలంపాటు పనిచేసి 1997లో పాడైపోయింది. అప్పటి నుంచి ఆ లిఫ్ట్ వాడుకలో లేదు. తాజాగా మరమ్మత్తులు చేపట్టాలని నిర్ణయించిన ఆస్పత్రి యాజమాన్యం ఆ లిఫ్ట్ ను తెరిపించింది. అందులో పూర్తిగా శిథిలమైపోయిన ఓ అస్తిపంజరం బయటపడడం కలకలం రేపింది. 

Skeleton of Male Body Found at Base of Out-of-Order Elevator in UP Hospital
Author
Hyderabad, First Published Sep 7, 2021, 7:19 AM IST

లక్నో : పనిచేయకుండా పోయిన లిఫ్ట్ ను దాదాపు రెండున్న దశాబ్దాల తర్వాత తెరిచిన సిబ్బంది అందులోని దృశ్యాలను చూసి భయబ్రాంతులకు గురయ్యారు. అందులో ఓ వ్యక్తి అస్తి పంజరం బయటపడింది. ఉత్తరప్రదేశ్ కైలీలోని ఈపీసీఈ ఆస్పత్రిని 1991లో నిర్మించారు. 

అందులోని లిఫ్ట్ కొద్దికాలంపాటు పనిచేసి 1997లో పాడైపోయింది. అప్పటి నుంచి ఆ లిఫ్ట్ వాడుకలో లేదు. తాజాగా మరమ్మత్తులు చేపట్టాలని నిర్ణయించిన ఆస్పత్రి యాజమాన్యం ఆ లిఫ్ట్ ను తెరిపించింది. అందులో పూర్తిగా శిథిలమైపోయిన ఓ అస్తిపంజరం బయటపడడం కలకలం రేపింది. 

విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు ఎముకలను డీఎన్ఏ పరీక్షల కోసం తరలించారు. అనంతరం ఈ మిస్టరీని ఛేదించే పనిలో పడ్డారు పోలీసులు. పనిచేయకుండా పోయిన లిఫ్ట్ లోకి మృతదేహం ఎలా వచ్చింది? లిఫ్ట్ ఆగిపోయిన సమయంలో ఆ వ్యక్తి అందులోనే ఉండిపోయాడా? లేదా ఎవరైనా అతడిని హత్య చేసి అందులో పడేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మృతుడిని గుర్తించేందుకు 24 యేళ్ల క్రితం తప్పిపోయినవారి సమాచారం సేకరిస్తున్నారు. డీఎన్ఏ నివేదిక వచ్చిన తరువాత మరింత సమాచారం తెలిసే అవకాశం ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios