ప్రముఖ వ్యాపార దిగ్గజం, మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తనకు ఆసక్తిగా అనిపించిన ప్రతి విషయంపై ఆయన స్పందిస్తూ ఉంటారు. కొందరు సామన్య ప్రజలు చేస్తున్న ట్వీట్లకు కూడా సమాధానాలు ఇస్తూ... అందరికీ అందుబాటులో ఉంటారు. 

ఒక్కోసారి చాలా ఫన్నీ విషయాలను, తనకు ఎంతో ఆసక్తిగా అనిపించిన విషయాలను కూడా తన ట్విట్టర్ లో ఆయన పోస్ట్ చేస్తూ ఉంటారు. కాగా... తాజాగా ఆయన ఓ ట్వీట్ చేశారు. ఇండియన్స్ బుర్రలు చాలా చిన్నగా ఉంటాయి అన్న ఓ పరిశోధనపై ఆయన స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది.

ఇంతకీ మ్యాటరేంటంటే...  కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ ఐటీ పరిశోధకులు భారతీయుల మెదళ్లు చాలా చిన్నవిగా ఉంటాయని చెప్పారు. వారు చేసిన పరిశోధనలో ఆ విషయం వెల్లడయ్యింది. దీనిని ఓ ఇంగ్లీష్ పత్రిక ప్రచురించగా.. దానికి తనదైన శైలిలో ఆనంద్ మహీంద్రా స్పందించారు.

ఆంగ్ల పత్రికలో ప్రచురితమైన న్యూస్ ట్విట్టర్ వేదికగా ఆనంద్ మహీంద్రా రీట్వీట్ చేశారు. దానిని ‘ సైజ్  ఎంత ఉందన్నది మ్యాటర్ కాదు’ అంటూ కౌంటర్ ఇచ్చారు.  సైజ్ ఎంత ఉందన్నది కాదు.. ఎంత బాగా దానిని ఇండియన్స్ ఉపయోగించుకుంటున్నారు అనే అర్థం వచ్చేలా ఆయన ఈ ట్వీట్ చేయడం విశేషం. ఆయన చేసిన ట్వీట్ నిమిషాల్లోనూ వైరల్ గా మారింది. ఆయన ట్వీట్ కి వేల మంది మద్దతు తెలుపుతుండటం విశేషం.