బంధువులతో కలిసి పెళ్లికి వచ్చిన ఆరేళ్ల బాలికపై గెస్ట్ హౌస్ ఉద్యోగి అత్యాచారానికి పాల్పడ్డాడు. జరిగిన దారుణాన్ని తన బంధువులకు చెప్పడంతో నిందితుడ్ని పట్టుకుని దేహశుద్ది చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన వెలుగులోకి వచ్చింది.జిల్లాలోని మకాన్‌పూర్ చౌకీ ప్రాంతంలో బంధువులతో కలిసి పెళ్లికి వచ్చిన ఆరేళ్ల బాలికపై గెస్ట్ హౌస్ ఉద్యోగి అత్యాచారానికి పాల్పడ్డాడు. జరిగిన దారుణాన్ని తన బంధువులకు చెప్పడంతో నిందితుడ్ని పట్టుకుని దేహశుద్ది చేశారు. అనంతరం నిందితుడ్ని పోలీసులకు అప్పగించారు. పోలీసులు అందించి సమాచారం ప్రకారం.. అరౌల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన నివాసి సోదరి వివాహం శనివారం నాడు జరిగింది. కుటుంబ సభ్యులందరూ పెళ్లి పనుల్లో చాలా బిజీబిజీగా ఉన్నారు.

ఈ క్రమంలో ఓ ఆరేళ్ల బాలిక ఆడుకుంటూ ఉంది. ఇంతలో ఇలియాస్‌పూర్ నివాసి రిపు ఆ బాలికను బలవంతంగా నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకవెళ్లి.. ఆ బాలికపై ఆఘాయిత్యానికి పాల్పడ్డారు. జరిగిన దారుణాన్ని ఆ బాధిత బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆగ్రహానికి గురైన బంధువులు నిందితుడు రిపు సక్సేనాను పట్టుకుని దేహాశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. ఫోరెన్సిక్ బృందం ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరించింది. తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా అత్యాచారం, పాక్సో చట్టం, ఎస్సీఎస్టీ చట్టం సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వైద్య పరీక్షలకు పంపినట్లు ఏసీపీ అలోక్ సింగ్ తెలిపారు. నిందితుడిని ప్రశ్నిస్తున్నారు.

షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ సభ్యురాలు డాక్టర్ అంజుబాల సిహెచ్‌సికి చేరుకుని బాధితురాలి బంధువులను పరామర్శించి సత్వర న్యాయం చేసి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అదే సమయంలో ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. బాలిక తండ్రి పారిపోయి నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. నిందితులు అతనితో గొడవకు దిగారు. ఈ క్రమంలో నిందితులు బాలిక తండ్రిని నెట్టి కింద పడేశారు. శబ్దం విని అక్కడికి చేరుకున్న ప్రజలు నిందితుడిని చ చేసి పట్టుకున్నారు.

 త్వరలో ఛార్జ్ షీట్ దాఖాలు

నిందితులపై చార్జిషీట్‌ను వీలైనంత త్వరగా కోర్టులో ప్రవేశపెట్టడమే కాకుండా ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ జరిపి నిందితులకు శిక్షపడేలా కృషి చేస్తామని పోలీసు కమిషనర్ బీపీ జోగ్దంద్ తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోనున్నారు.