దారుణమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఓ ఆరేళ్ల చిన్నారిపై యేడాదికాలంగా నలుగురు అత్యాచారానికి పాల్పడుతున్నారు. అయితే ఈ నలుగురూ పది నుంచి 14 యేళ్ల మైనర్లే కావడం షాక్ కలిగించే విషయం. ఈ ఘటన పంజాబ్ లో చోటు చేసుకుంది.
పంజాబ్ : అభం శుభం తెలియని ఆరేళ్ల బాలికపై ఏడాదిగా నలుగురు molestationకి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనలో నిందితులు నలుగురూ minors కావడం.. పది, 11, 14 యేళ్లవారే కావడం గమనార్హం. సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఈ ఘటన పంజాబ్ లో చోటు చేసుకుంది. ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. మరొకరు పరారీలో ఉన్నారు. punjabహోషియార్పూర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలికపై నలుగురు బాలురు ఏడాదిగా అత్యాచారానికి పాల్పడ్డారు. మొదట తనకేం జరిగిందో తెలియని బాలిక.. ఆ తరువాత అది కంటిన్యూ అవుతుండడంతో ఇటీవల తన తల్లిదండ్రులకు ఆ girl ఈ విషయాన్ని తెలియజేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
దీనిపై బాలిక తల్లిదండ్రులు ఇటీవల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోక్సో చట్టం పై నలుగురు పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో పోక్సో చట్టం కింద నలుగురి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో ముగ్గురిని అదుపులోకి తీసుకుని జువైనల్ హోమ్ కు తరలించారు. వీరి వయస్సు పది పదకొండు సంవత్సరాలే. ఏడాదిపాటు పలుమార్లు బాలికపై వీరు అత్యాచారానికి పాల్పడినట్లు దర్యాప్తు అధికారి కమలేష్ కుమారి తెలిపారు. 14 ఏళ్ల వయసున్న మరో బాలుడు పరారీలో ఉన్నట్లు చెప్పారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా, మార్చి 31న ఇలాంటి ఘటనలో బాలికపై Molestation జరిపిన కేసులో నిందితుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు వెయ్యి రూపాయల fine కూడా చెల్లించాలని court ప్రత్యేక న్యాయమూర్తి శ్రీనివాసరావు తీర్పునిచ్చారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో రెండు నెలల జైలు శిక్ష అనుభవించాలి అని న్యాయమూర్తి ఆదేశించారు. ఫోక్సో న్యాయస్థానం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కరణం కృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బాజీ జంక్షన్, కూరగాయల మార్కెట్ ప్రాంతానికి చెందిన చాపల శ్రీనివాసరావు (32) రాడ్ బెండర్ గా పని చేసేవాడు. బుచ్చి రాజుపాలెం, పైడితల్లమ్మ ఆలయం ప్రాంతానికి చెందిన బాలిక (6) 2016 జూలై 19న పైడితల్లమ్మ ఆలయం వద్ద ఒంటరిగా ఆడుకుంటుంది.
శ్రీనివాసరావు బాలిక నోరు మూసి ఆలయం వెనుక భాగంలో ఉన్న పాడు పడిన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు ప్రాసిక్యూషన్ ఆరోపించింది. బాధితురాలు తనపై జరిగిన అఘాయిత్యాన్ని తన తండ్రికి సంజ్ఞలతో తెలిపింది. తండ్రి ఫిర్యాదు మేరకు ఎయిర్పోర్ట్ పోలీసులు కేసు నమోదుచేసి నిందితుడు శ్రీనివాసరావు న్యాయస్థానంలో హాజరుపరిచారు. పరిశీలించిన న్యాయమూర్తి పైవిధంగా శిక్ష విధించారు.
ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే ఫిబ్రవరి 4న మైసూరులో చోటు చేసుకుంది. ఆపదలో ఉన్న వారిని రక్షించాల్సిన పోలీస్ అధికారి అయి ఉండి mental condition సరిగా లేని యువతిని చెరబట్టిన కామాంధుడికి court కఠిన శిక్ష విధించింది. తుమకూరు నగరం వద్ద యువతిపై ఏఎస్ఐ ఉమేశయ్య అత్యాచారం చేసినట్లు నేరం రుజువు కావడంతో అతనికి 20 సంవత్సరాల imprisonmentతో పాటు.. లక్ష రూపాయల జరిమానా విధిస్తూ కోర్టు జడ్జి హెచ్.ఎస్.మల్లికార్జునస్వామి తీర్పు వెలువరించారు.
