న్యూఢిల్లీ: లండన్ నుండి ఇండియాకు వచ్చిన ఎయిరిండియా విమానంలో ప్రయాణించిన ఆరుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని మంగళవారం నాడు అధికారులు ప్రకటించారు.సోమవారం నాడు రాత్రి పదకొండున్నర గంటలకు విమానం న్యూఢిల్లీకి చేరుకొంది. ఐదుగురు ప్రయాణీకులకు ఢిల్లీ ఎయిర్ పోర్టులోనే కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. 

also read:కరోనా ఎఫెక్ట్: ఈ నెలాఖరు వరకు బ్రిటన్ నుండి వచ్చే విమానాలపై నిషేధం విధించిన ఇండియా

ఢిల్లీ నుండి చెన్నై వెళ్లిన ప్రయాణీకుడికి చెన్నై ఎయిర్ పోర్టులో కోవిడ్ నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. 

 

ఇవాళ్టి నుండి ఈ నెలాఖరు వరకు లండన్ కు విమానాలపై నిషేధం విధించింది. యూకే నుండి వచ్చే ప్రతి ప్రయాణీకుడికి కరోనా పరీక్షలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ విషయమై దేశంలోని అన్ని విమానాశ్రయ సిబ్బందిని కేంద్రం అప్రమత్తం చేసింది.