మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలో కాల్పులు కలకలం రేపాయి. జిల్లాలోని లేపా గ్రామంలో చాలాకాలంగా ఉన్న భూ వివాదంపై ఈ కాల్పులకు దారితీసింది.

మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలో కాల్పులు కలకలం రేపాయి. జిల్లాలోని లేపా గ్రామంలో చాలాకాలంగా ఉన్న భూ వివాదంపై ఈ కాల్పులకు దారితీసింది. ఒక కుటుంబంపై మరో కుటుంబం కాల్పులకు పాల్పడింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. మరికొందరికి గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మోరీనా ఆసుపత్రికు తరలించారు. 

రంజిత్‌ తోమర్‌, రాధే తోమర్‌ల మధ్య భూ యాజమాన్యం విషయంలో కొనసాగుతున్న వివాదం కారణంగా ఈ ఘటన జరిగింది. 2014లో రంజిత్ తోమర్ కుటుంబ సభ్యులు రాధే తోమర్ కుటుంబానికి చెందిన ముగ్గురిని చంపారు. ఆ తర్వాత రంజిత్ తోమర్ కుటుంబం గ్రామం విడిచిపెట్టి వెళ్లిపోయింది. అయితే ఇటీవల రంజిత్ తోమర్ కుటుంబం గ్రామానికి తిరిగి వచ్చింది. దీంతో రాధే తోమర్ కుటుంబం ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే రంజిత్ తోమర్ కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. ఘటన అనంతరం నిందితులు, వారి కుటుంబ సభ్యులు పారిపోయారు. 

అయితే నిందితుల కోసం గాలింపు చేపట్టినట్టుగా పోలీసులు చేపట్టారు. నిందితులు సమీపంలోని పొలాలు, లోయలలో దాగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.