Road accident: ఛత్తీస్ గఢ్ లోని బలోడాబజార్ లో వ్యాన్ ను లారీ ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు. బలోడాబజార్ జిల్లాలోని జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున 30 మందితో వెళ్తున్న పికప్ వ్యాన్ ను ట్రక్కు ఢీకొనడంతో ఓ చిన్నారి సహా ఆరుగురు మృతి చెందారని పోలీసులు తెలిపారు.
Balodabazar Road accident: ఛత్తీస్ గఢ్ లోని బలోడాబజార్ లో వ్యాన్ ను లారీ ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు. బలోడాబజార్ జిల్లాలోని జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున 30 మందితో వెళ్తున్న పికప్ వ్యాన్ ను ట్రక్కు ఢీకొనడంతో ఓ చిన్నారి సహా ఆరుగురు మృతి చెందారని పోలీసులు తెలిపారు.
ఈ ప్రమాదం గురించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఛత్తీస్ గఢ్ లోని బలోడాబజార్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ట్రక్కు, పికప్ వ్యాన్ ఢీకొన్న ఘటనలో ఓ చిన్నారి సహా ఆరుగురు మృతి చెందగా, 25 మంది గాయపడ్డారు. బలోడాబజార్ జాతీయ రహదారిపై గోదా పులియా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో పికప్ వ్యాన్ లో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నట్లు అధికారులు తెలిపారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. క్షతగాత్రులు ప్రస్తుతం బలోడాబజార్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పలారి పోలీస్ స్టేషన్ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదుచేసుకున్నామనీ, తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
హిమాచల్ ప్రదేశ్ లోనూ..
హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలోని ధర్మశాల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన ట్రక్కు 100 మీటర్ల లోతైన లోయలో పడింది. అతివేగంతో ప్రయాణిస్తున్న ట్రక్కు బోల్తా పడడంతో ఐదుగురు మృతి చెందారు. అందులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులున్నారు. అదే సమయంలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. చాలా మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.ఆదివారం మధ్యాహ్నం రాసెహర్ గ్రామంలో ఈ ప్రమాదం జరిగినట్లు వారు తెలిపారు. నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఏఎస్పీ హితేష్ లఖన్‌పాల్ తెలిపారు.
