తమిళనాడు రాష్ట్రంలో మంగళవారం తెల్లవారుజామున ఘెర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో... చిన్నారి సహా ఆరుగురు కన్నుమూశారు.  తిరునెల్వేలి నుంచి టెంకాసి నేషనల్ హైవేపై ప్రమాదం చోటుచేసుకుంది. అలాంగులం అనే ప్రాంతం వద్ద తిరునెల్వేలి నుంచి టెంకాసికి వెళుతున్న లారీ, ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. 

ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు దుర్మరణం చెందారు. మృతి చెందిన వారిలో మురుగన్, నిరంజన్ కుమార్, రాజశేఖర్, శేష శ్రీ, డ్రైవర్ మహేష్, రెండు వారాల పసిపాప ఉండడం తీవ్ర విషాదంగా మారింది. ఘటనలో రాజప్ప అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.