Asianet News TeluguAsianet News Telugu

లఖీంపూర్ ఖేరీలో బీజేపీ కార్యకర్తలపై దాడి ఘటనలో ఇద్దరు రైతులను అరెస్టు చేసిన సిట్

లఖీంపూర్ ఖేరీలో  బీజేపీ కార్యకర్తలపై దాడి చేసిన ఇద్దరు రైతులను సిట్ అరెస్టు చేసింది. గతేడాది అక్టోబర్ 3న లఖీంపూర్ ఖేరీలో చెలరేగిన హింసాకాండలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలను కొట్టి చంపారు. ఈ ఘ‌ట‌న‌లో ప్ర‌మేయం ఉంద‌నే అభియోగంతో ఇద్దరు రైతులను సిట్ అరెస్టు చేసింది. 

SIT arrests two farmers in attack on BJP workers in Lakhimpur Kheri
Author
Uttar Pradesh, First Published Jan 2, 2022, 2:59 PM IST

లఖీంపూర్ ఖేరీలో  బీజేపీ కార్యకర్తలపై దాడి చేసిన ఇద్దరు రైతులను సిట్ అరెస్టు చేసింది. గతేడాది అక్టోబర్ 3న లఖీంపూర్ ఖేరీలో చెలరేగిన హింసాకాండలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలను కొట్టి చంపారు. ఈ ఘ‌ట‌న‌లో ప్ర‌మేయం ఉంద‌నే అభియోగంతో ఇద్దరి రైతులను సిట్ అరెస్టు చేసింది. గ‌తంలో కొంత మంది అనుమానుత‌ల ఫొటోల‌ను సిట్ విడుద‌ల చేసింది. ఇందులో ఇద్ద‌రు కోసం పోలీసులు వెతుకుతున్నారు. గ‌త రెండు నెల‌ల నుంచి వారు పోలీసుల నుంచి త‌ప్పించుకొని తిరుగుతున్నారు. అరెస్టు చేసిన చేసిన రైతుల పేర్లు కమల్‌జీత్‌ సింగ్‌ (29), కవల్‌జీత్‌ సింగ్‌ సోను (35)గా సిట్ గుర్తించింది. 

ఉత్త‌ర‌భార‌తంలో ఎముకలు కొరికే చ‌లి.. వ‌ణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు !

ఈ ఇద్ద‌రు రైతుల‌ను ఈరోజు సిట్ మేజిస్ట్రేట్ ఎదుట హాజ‌రుప‌ర్చనున్నారు. త‌రువాత వారిద్ద‌రిని రిమాండ్ క‌స్ట‌డీకి అందించాల‌ని సిట్ కోర‌నుంది. ముగ్గురు బీజేపీ కార్యకర్తల మృతికి సంబంధించిన కేసులో  ఇప్పటి వరకు ఆరుగురు రైతులను అరెస్టు చేశారు.ఇందులో విచిత్ర సింగ్, గుర్విందర్ సింగ్, అవతార్ సింగ్, రంజీత్ సింగ్‌లు ఉన్నారు. నేడు మ‌రో ఇద్ద‌రిని అరెస్టు చేశారు. 

నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాలు ర‌ద్దు చేయాల‌ని కోరుతూ రైతులు చేస్తున్న ఆందోళ‌న హింస‌కు దారి తీసిన సంగ‌తి తెలిసిందే. ఈ హింసాకాండ‌లో నలుగురు రైతులు, ఒక జర్నలిస్టు మరణించారు. అయితే త‌రువాత జ‌రిగిన ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు బీజేపీ కార్య‌కర్త‌లు మృతి చెందారు.అంత‌కు ముందు రైతుల‌పై కాన్వాయ్ ఎక్కించిన ఘ‌ట‌నలో నిందితులుగా ఉన్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా టెనీ కుమారుడు ఆశిష్ మిశ్రాతో పాటు బీజేపీ కార్యకర్త సుమిత్ జైస్వాల్ ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. అయితే  సుమిత్ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఆశిష్ కాన్వాయ్ ఎక్కించిన ఘ‌ట‌న‌లో మృతి చెందిన ఐదుగురి గురించి ప్రస్తావించలేదు.ఆశిష్‌, ఇత‌రులపై తులు దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ హింస ఘ‌ట‌న‌లో మొదటి ఎఫ్‌ఐఆర్‌ను పోలీసులు నమోదు చేశారు.

సీడీఎస్ బిపిన్ రావత్ చాపర్ కూలిపోవడానికి కారణం అదేనా?.. త్వరలో వైమానిక దళ దర్యాప్తు రిపోర్టు

ఈ ల‌ఖీంపూర్ ఘ‌ట‌న‌లో మొత్తం 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘ‌ట‌న అనుకోకుండా జ‌రిగింది కాద‌ని ఇది ప‌క్కా ప్ర‌ణాళిక చేశార‌ని సిట్ త‌న ద‌ర్యాప్తులో పేర్కొంది. 2021 సంవ‌త్స‌రం  నవంబర్ లో సుప్రీం కోర్టు సిట్ ను పునర్నిర్మించింది.  ఇందులో కొత్త స‌భ్యుల‌ను చేర్చింది. ఐపీఎస్ ఆఫీస‌ర్లు, పంజాబ్‌, హర్యానా హైకోర్టు రిటైర్డ్ జడ్జి రాకేష్ కుమార్ జైన్‌, శిరాద్కర్, ప్రీతీందర్ సింగ్, పద్మజా చౌహాన్ ఉన్నారు. కేంద్ర తీసుకొచ్చిన మూడు నూతన సాగు చ‌ట్టాలు ర‌ద్దు చేయాల‌ని కోరుతూ రైతులు చేస్తున్న ఉద్య‌మంలో భాగంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ల‌ఖీంపూర్ లో రైతులు నిర‌స‌న చేప‌ట్టారు. రైతులు నిర‌స‌న తెలుపుతున్న స‌మ‌యంలో కేంద్ర మంత్రి అజ‌య్ మిశ్రా కుమారుడు అశిష్ మిశ్రా న‌డుపుతున్న కారు నిర‌స‌నకారుల మీదు నుంచి వెళ్లింది. ఈ ఘ‌ట‌న‌లో అక్క‌డిక్క‌డే న‌లుగురు రైతులు మృతి చెందారు. అనంత‌రం చోటు చేసుకున్న అల్ల‌ర్ల‌లో మ‌రో 4 గురు మృతి చెందారు. దీనిని క‌వ‌ర్ చేసేందుకు వెళ్లిన ఒక రిపోర్ట‌ర్ కూడా ఈ ఘ‌ట‌న‌లో మృతి చెందారు. ఈ ఘ‌ట‌నతో దేశం మొత్తం ఒక్కసారిగా క‌ల‌క‌లం రేగింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios