విమానం ఇంజిన్ లో మంటలు రావడంతో.. అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ సంఘటన చెన్నైలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... తిరుచ్చిరాపల్లి నుంచి సింగపూర్ బయలుదేరిన టీఆర్ 567 స్కూట్ విమానం ఇంజిన్ లో మంటలు వ్యాపించాయి. వెంటనే గమనించిన పైలెట్ అప్రమత్తమయ్యాడు. 

అధికారుల అనుమతితో చెన్నై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్‌చేశారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. ఈ ఘటనతో విమానంలోని ప్రయాణికులు భయపడిపోయారు. 

సిబ్బంది సహా 170 మంది ప్రయాణీకులు సురక్షితంగా బయటపడడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు నిపుణులు విమానాన్ని పరిశీలిస్తున్నారు. క్షుణ‍‍్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈ సాయంత్రానికి ఈ విమానం  తిరిగి  సింగపూర్‌ బయలు దేరనుందని సమాచారం. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు తగిన వసతి సదుపాయాలను కల్పించినట్టు అధికారులు తెలిపారు.