Asianet News TeluguAsianet News Telugu

సిక్కింలో ఆకస్మిక వరదల బీభత్సం.. 77 మంది మృతి, కొనసాగుతున్న సహాయక చర్యలు

Sikkim floods: సిక్కిం ఆకస్మిక వరదలు పెను బీభ‌త్సం సృష్టించాయి. వ‌ర‌ద‌ల కార‌ణంగా రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 77కు పెరిగింది. వంద‌ల మంది గ‌ల్లంత‌య్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు వరదలో చిక్కుకున్న 2,500 మందిని రక్షించారు.
 

Sikkim flash floods: Toll climbs to 77, over 100 missing RMA
Author
First Published Oct 8, 2023, 7:55 PM IST

North Sikkim flash floods: వరద ప్రభావిత రాష్ట్రమైన సిక్కింలో ఆదివారం మొత్తం 77 మంది మరణించినట్లు అధికారులు ధృవీకరించారని ఏజెన్సీ ఫ్రాన్స్-ప్రెస్ నివేదించింది. సహాయక చర్యలు కొనసాగుతున్నందున సిక్కింలోని వివిధ ప్రాంతాల నుంచి ఇప్పటివరకు మొత్తం 29 మృతదేహాలను వెలికితీశామని రాష్ట్ర సహాయ కమిషనర్ అనిల్రాజ్ రాయ్ తెలిపారు. అక్టోబర్ 3న రాష్ట్రంలో ఎత్తైన హిమానీనద సరస్సు విస్ఫోటనం చెందడంతో ఒక్కసారిగా వరదలు వచ్చాయి. వరదలు సంభవించిన నాలుగు రోజుల తరువాత తీస్తా నది వెంబడి నీటి మట్టాలు సాధారణ స్థితికి వచ్చినప్పటికీ, సిక్కిం అంతటా రోడ్లు, వంతెనలు దెబ్బ‌తిన‌డంతో కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లకు విస్తృతమైన నష్టం సంభవించింది. విధ్వంసం కారణంగా చాలా మంది స‌హాయం కోసం ఎదురుచూస్తున్నారు.

వ‌రదల్లో చిక్కుకున్న 2,500 మందిని రక్షించినట్లు రాష్ట్ర విపత్తు నియంత్రణ విభాగం నివేదించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఎయిర్ లిఫ్ట్ రెస్క్యూలు ఆలస్యమవడంతో రాష్ట్రంలోని ఉత్తర ప్రాంతంలోని సహాయ శిబిరాల్లో ఉన్న సుమారు 3,000 మంది ఇప్పటికీ సురక్షితంగా తిరిగి రావడానికి ఎదురుచూస్తున్నారు. ఇదిలావుండగా, ఉత్తర సిక్కింలోని చుంగ్తాంగ్లో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) రెస్క్యూ టీం ఆదివారం చేసిన రోప్వే ద్వారా 52 మంది పురుషులు, నలుగురు మహిళలు సహా 56 మంది పౌరులను విజయవంతంగా రక్షించారు. పొరుగు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్ లో మరో 48 మృతదేహాలను గుర్తించినట్లు జల్పాయిగురి జిల్లా పోలీసులు తెలిపారు. 100 మందికిపైగా ఆచూకీ తెలియడం లేదని అధికారిక రికార్డులు చెబుతున్నాయి.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా ఆదివారం గ్యాంగ్ టక్ లోని ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ నివాసంలో ఆకస్మిక వరదలపై సమావేశమయ్యారు. సమావేశం అనంతరం సీఎం తమాంగ్ మీడియాతో మాట్లాడుతూ వరద ప్రభావిత రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తున్నాయన్నారు. "రాష్ట్రంలో వరదలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ తో సమావేశమయ్యారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు యావత్ కేంద్ర ప్రభుత్వం సిక్కిం ప్రజలకు అండగా నిలుస్తోంది. ప్రజలను రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపినట్లు" సీఎం తమాంగ్ తెలిపారు.

కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామనీ, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్వో), ఇతర విభాగాలతో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. సిక్కిం ప్రభుత్వానికి తక్షణ నిధులు అందించినందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సిక్కింలో రోడ్లు, మౌలిక సదుపాయాలు భారీగా కోల్పోతున్నామని కేంద్ర సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా తెలిపారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు వ్యవసాయ, రోడ్లు, నీరు, ఇంధన మంత్రిత్వ శాఖల ప్రతినిధులతో కూడిన బృందాన్ని కేంద్రం ఏర్పాటు చేసిందని మిశ్రా తెలిపారు. "ఐటీబీపీ (ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్), ఎన్డీఆర్ఎఫ్ (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) అధికారులను కూడా ప్రభావిత ప్రాంతాలకు పంపించాం. ఎస్డీఆర్ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్)కు కేంద్ర హెచ్ఎం అమిత్ షా నిధులు విడుదల చేశారు. ఎన్డీఆర్ఎఫ్ కు కూడా అన్ని విధాలా సహకరిస్తామని" హామీ ఇచ్చారని మిశ్రా తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios