Asianet News TeluguAsianet News Telugu

సైలెంట్‌గా ఉండక‌పోతే.. నీ కొడుకు కంటే నిన్ను దారుణంగా చంపుతాం.. 

లారెన్స్ బిష్ణోయ్ గ్రూప్ పేరుతో పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా తండ్రి బల్కౌర్ సింగ్‌కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. 
 

 Sidhu Moose Wala father receives threatening message
Author
First Published Sep 2, 2022, 4:33 PM IST

అత్యంత దారుణంగా హ‌త్య‌కు గురైన పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా తండ్రిని దారుణంగా చంపుతామని మ‌రోసారి బెదిరింపులు వ‌చ్చాయి. దీంతో  మూసేవాలా కుటుంబ సభ్యులను ఆందోళనకు గురవుతున్నారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు సిద్ధూ మూసేవాలా తండ్రి బల్కౌర్ సింగ్ ను చంపుతామ‌ని బెదిరించాడు. ఈమెయిల్ ద్వారా బెదిరింపుల‌కు పాల్పడ్డారు.

లారెన్స్ బిష్ణోయ్, జగ్గు భగవాన్‌పురియా భద్రత గురించి ఏదైనా మాట్లాడితే.. మీ పరిస్థితి కూడా మీ కొడుకు కంటే ప్రమాదకరంగా ఉంటుందని మెయిల్ చేశారు. సిద్ధూ మెయిల్ ఐడీకి షూటర్ లారెన్స్ బిష్ణోయ్ పేరుతో ఈ మెయిల్‌ వచ్చింది. ఈ మెయిల్‌లో.. మీ కొడుకు మా సోదరులను చంపారు, మీ కొడుకును మేము చంపాము. మీ ఒత్తిడితోనే మన్‌ప్రీత్ మన్ను, జగ్రూప్ రూప నకిలీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇది  మరిచిపోలేదు. నోరుమూసుకొని సైలెంట్‌గా ఉండక‌పోతే.. నీ కొడుకు కంటే నిన్ను దారుణంగా చంపుతాం అని లారెన్స్ బిష్ణోయ్ అనుచ‌రుడు వార్నింగ్ ఇచ్చాడు.

అయితే బెదిరింపులకు సంబంధించి పోలీసులు ఎలాంటి అధికారిక ధృవీకరణ ఇవ్వలేదు. మూసేవాలా హంతకులకు ఇంత భద్రత ఎందుకు ఇస్తున్నారని బాల్కౌర్ సింగ్ కొద్దిరోజుల క్రితం ప్రశ్నించారు. ముసేవాలాకు ఇంత రక్షణ లభించి ఉంటే ఈరోజు అతని కొడుకు బతికే ఉండేవాడ‌ని ప్ర‌శ్నించారు. కొద్ది రోజుల క్రితం సిద్ధూ ముసేవాలా తల్లిదండ్రులు మాన్సాలో క్యాండిల్ మార్చ్ నిర్వహించారు. 

ఈ సమయంలో బాల్కౌర్ సింగ్ మాట్లాడుతూ.. ఓ కొడుకును కోల్పోయిన తండ్రిగా ఫలితం ఏదైనా.. తాను మౌనంగా కూర్చోనని అన్నారు. స్వేచ్ఛగా తిరుగుతున్న హంతకులను కటకటాల వెనక్కి పంప‌డానికి పోరాటం చేస్తున్నాన‌నీ, వందలాది మంది అభిమానులే సిద్ధూకు బలం. న్యాయం కోసం పోరాడుతామ‌ని అన్నారు. 
 
పంజాబీ గాయకుడు సిద్ధూ ముసేవాలా హత్యకేసులో ప్రధాన నిందితుడు సచిన్ థాపన్ అరెస్ట్ తర్వాత, అతని సహచరుడు అన్మోల్ బిష్ణోయ్‌ను కెన్యాలో అరెస్టు చేశారు. వారిద్దరినీ నకిలీ పాస్‌పోర్టుల ద్వారా గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ భారత్ నుంచి వెళ్లిపోయారు. సిద్ధు ముసేవాలా హత్యకు సంబంధించిన పూర్తి ప్రణాళికను సిద్ధం చేయడంలో సచిన్ థాపన్ , అన్మోల్ బిష్ణోయ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఆ సమయంలో వారిద్దరూ కెనడాలో దాక్కున్న గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. సచిన్ థాపన్ గ్యాంగ్‌స్టర్ లారెన్స్‌కు బంధువు, 

సిద్ధూ ముసేవాలా హత్య కేసులో మాన్సా పోలీసులు చార్జీ షీట్ సమర్పించారు. 1850 పేజీల చార్జీ షీట్ లో 24 మందిని నిందితులుగా పేర్కొన్నారు.  వీరిలో 20 మందిని అరెస్టు చేశారు. నలుగురు నిందితులు విదేశాల్లో తలదాచుకుంటున్నారు. ప్రస్తుతం పంజాబ్‌ పోలీసుల అదుపులో ఉన్న గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ హత్యకు సూత్రధారి అని తేలింది. 

Follow Us:
Download App:
  • android
  • ios