Asianet News TeluguAsianet News Telugu

‘అహిందా’ వ్యూహంలో నిపుణుడు, ఫోన్ వాడని నాయకుడు సిద్ధరామయ్య.. ఇతర పార్టీల్లో కూడా గౌరవం ఆయన సొంతం

తదుపరి కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్యే రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సీఎల్పీ నేతగా గురువారం ఆయన ఎన్నిక పూర్తయ్యింది. కర్ణాటక చరిత్రలోనే మొదటి సారిగా సీఎంగా తన ఐదేళ్ల పూర్తి పదవి కాలాన్ని పూర్తి చేసి రికార్డు నెలకొల్పిన ఆయన.. రెండో సారి సీఎం పీఠాలు అధిరోహించబోతున్నారు. 

Siddaramaiah is an expert in 'Ahinda' strategy and a leader who doesn't use a phone. He is respected in other parties as well..ISR
Author
First Published May 19, 2023, 12:26 PM IST

కర్ణాటకలో సీఎం ఎవరనే విషయంలో క్లారిటీ వచ్చింది. తదుపరి సీఎం పీఠంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యనే కూర్చోబెట్టాలని అధిష్టానం గురువారం నిర్ణయించింది. దీంతో కొన్ని రోజులుగా కొనసాగుతున్న సస్పెన్షన్ కు తెరపడింది. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివ కుమార్ కూడా ఈ పదవి కోసం గట్టిగానే పోటీ పడినప్పటికీ.. చివరి నిమిషంలో అధిష్టానం నిర్ణయానికి తలొగ్గారు. దీంతో సీఎం సీటులో సిద్ధరామయ్య కూర్చోబోతున్నారని ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. 

పార్టీ నిర్ణయంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఏకీభవించారు. గురువారం జరిగిన సమావేశంలో సిద్ధరామయ్యను సీఎల్పీ నాయకుడిగా ఎన్నుకున్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం సిద్ధరామయ్యనే ఎందుకు సీఎంగా ఎంపిక చేసిందనే విషయం విశ్లేషిస్తే.. అనేక కారణాలు కనిపిస్తాయి. ఆయన అహిందా వ్యూహంలో నిపుణుడిగా ఉన్నారు. ఈ అహిందా (మైనారిటీలు, వెనుకబడిన తరగతులు, దళితులకు కన్నడ సంక్షిప్త పదం) వ్యూహం కర్ణాటకలో కాంగ్రెస్ ఎన్నికల వ్యూహంలో ప్రధానమైనది. ప్రజల్లో కూడా ఆయనకు పెద్ద ఎత్తున మద్దతు ఉంది.

ఎవరెస్టు బేస్ క్యాంపు వద్ద భారత పర్వతారోహకురాలు మృతి.. రికార్డు సృష్టించాలనే లక్ష్యంతో వెళ్లినా.. అస్వస్థతతో

గత ఏడాది ఆగస్టులో కాంగ్రెస్ ప్రచారంపై ఇంకా ఎలాంటి స్పష్టతా లేనప్పుడు.. సిద్ధరామయ్య తన 75 వ పుట్టినరోజును జరుపుకున్నారు. కర్ణాటకలోని దావణగెరెలో నిర్వహించిన ఈ సిద్ధమహోత్సవానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. మరుసటి రోజు తమకు స్థలం సరిపోదనే ఉద్దేశంతో అనేక మంది రాత్రి వచ్చి బహిరంగ మైదానంలో నిద్రించారు. ఈ కార్యక్రమం ఆరు లక్షల మందికి పైగా ప్రజలను ఆకర్షించింది. ఈ వేడుకకు ప్రత్యేక అతిథిగా హాజరైన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సైతం సభాస్థలికి వెళ్లేందుకు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. ఈ ఎన్నికల సీజన్ లో సిద్ధరామయ్యకు అదే తొలి బలప్రదర్శన.. ఆయనెవరో పార్టీ నాయకత్వానికి గుర్తుచేస్తూ.. తాను పార్టీ నుంచి కాకుండా ప్రజల నుంచి తన బలాన్ని కూడగట్టుకున్న ప్రజానాయకుడని అధిష్టానానికి అర్థమయ్యేలా చెప్పారు. 

అయితే ఆర్థిక మంత్రిగా, ముఖ్యమంత్రిగా పని చేసిన ఈ సీనియర్ నాయకుడికి ఇప్పటి వరకు సొంతంగా సెల్ ఫోన్ కూడా లేదు. కానీ ఆయన పార్టీలోని అగ్రనేతలతో సహా ప్రపంచం మొత్తానితో ఆయన వ్యక్తిగత సహాయకుడి ద్వారానే కనెక్ట్ అవుతారు. మహిళలు, నిరుద్యోగ యువతకు ఆదాయ మద్దతు, పేదలకు 10 కిలోల ఉచిత బియ్యం వంటి హామీలతో ఓటర్లను ఒప్పించి పార్టీని 136 సీట్ల చారిత్రాత్మక విజయం దిశగా తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించింది సిద్ధరామయ్యే. ఆయన ప్రభావంతోనే దావణగెరెలో ఈసారి ఒక్క సీటు మినహా అన్ని స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది.

ఓర్నీ.. యువతి పెళ్లి జరుగుతుండగా మాజీ ప్రియుడు ఎంట్రీ.. మండపంపైకి ఎక్కి అతడు చేసిన పనికి వివాహం రద్దు..

సిద్ధరామయ్య 2013 నుంచి 2018 మధ్య కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా విజయవంతంగా పనిచేశారు. అప్పటి వరకు పూర్తి కాలం పాటు సీఎంగా ఆ రాష్ట్రంలో ఎవరూ పని చేయలేదు. ఈ కాబట్టి ఆయన పదవి కాలం ఒక రికార్డుగా నిలిచింది. పేదలకు ప్రతీ నెలా 7 కిలోల ఉచిత బియ్యం అందించే పార్టీ అన్న భాగ్య పథకానికి ఆయనే ముఖచిత్రం. ఒక టర్మ్ పూర్తి చేసుకుని, ఎన్నికల్లో ఓడిపోయి, ఆ తర్వాత తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య రికార్డు సృష్టించారు. 

కాంగ్రెస్ ఆయనను ఎందుకు ఎంపిక చేసింది?
కర్ణాటకలో మూడో అతిపెద్ద కులమైన కురుబ సామాజిక వర్గానికి చెందిన సిద్ధరామయ్య.. శక్తివంతమైన అహిందా వ్యూహంలో నిపుణుడు. ఇదే తమ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో లాభం చేకూరుస్తుందని అధిష్టానం భావిస్తోంది. ఓబీసీ జనాభా గణన, రిజర్వేషన్ పరిమితిని 75 శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తూ ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ)లను తమ వైపు తిప్పుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ కి సిద్ధరామయ్య నియామకం బూస్ట్ ఇస్తుందని అనుకుంటోంది. 

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇతర రాజకీయ శక్తివంతమైన ముఖ్యమంత్రులైన రాజస్థాన్ లో అశోక్ గెహ్లాట్, ఛత్తీస్ ఘడ్ లో భూపేశ్ బఘేల్ కూడా ఓబీసీ వర్గాలకు చెందిన వారే అనే విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. గ్రామీణ ప్రజానీకానికి ప్రాతినిధ్యం వహించే రాజకీయ నాయకుడిగా, గ్రామీణ, వ్యవసాయ సమస్యలపై నిష్పక్షపాతంగా వ్యవహరించే సిద్ధరామయ్యకు ప్రజలపై ఉన్న అధికారానికి ఇతర పార్టీల్లో గౌరవం ఉంది. కాగా.. సిద్దరామయ్య ముఖ్యమంత్రి కావడంపై రాహుల్ గాంధీ కూడా స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది.

తమిళనాడులో విషాదం.. బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు, ముగ్గురు మృతి, మరొకరికి గాయాలు

లౌకిక విలువల విషయంలో రాజీ పడని సోషలిస్టు భావాలున్న మాస్ లీడర్ గా, కర్ణాటకలో కాంగ్రెస్ తిరుగులేని పునరాగమనం చేసిన 76 ఏళ్ల సిద్ధరామయ్య వ్యక్తిత్వంలో అనేక కోణాలు ఉన్నాయి. ప్రతీ ఒక్కరూ తన వ్యక్తిగత సహాయకుడి ద్వారా తనను కలుస్తారనే ఉద్దేశంతో ఆయన వెంట ఫోన్ కూడా తీసుకెళ్లరు. తన రాజకీయాలలో పేదలను కేంద్రబిందువుగా చూసుకుంటారు. ప్రజల శక్తి తెలిసిన, తన ప్రత్యర్థులను అధిగమించగలిగిన తెలివైన రాజకీయ నాయకుడు.

సిద్దరామయ్య అనేక సార్లు ప్రత్యేక రాష్ట్ర జెండా కోసం వాదించారు. నగర సబ్ వేలపై హిందీలో ఉన్న గుర్తులను తొలగించి, వాటి స్థానంలో ఆ ప్రాంత సొంత భాష - కన్నడలో ఉన్న బోర్డులను తొలగించాలని వ్యక్తిగతంగా ఆదేశించారు. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య బీజేపీని,  రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)ను సైద్ధాంతికంగా, కుల సమస్యలపై ఎదుర్కోగల బలమైన, ప్రాంతీయ గుర్తింపు ఉన్న నాయకుడు.  

ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై హైకోర్టు స్టే.. ఎందుకంటే ?

ఆర్థిక మంత్రిగా 13 రాష్ట్ర బడ్జెట్లను ప్రవేశపెట్టిన ఆయనకు పరిపాలనతో పాటు ఆర్థికమే అతిపెద్ద బలం అని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. 1983లో లోక్ దళ్ పార్టీ తరఫున చాముండేశ్వరి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన ఈ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు గెలిచి మూడుసార్లు ఓడిపోయారు. 2008లో తన చిన్న కుమారుడి కోసం నిర్మించిన వరుణను ఖాళీ చేసి తిరిగి చాముండేశ్వరికి వెళ్లాడు. ఈసారి వరుణ స్థానం నుంచి గెలుపొందారు.

Follow Us:
Download App:
  • android
  • ios