ఇంకేముంది అది మనల్ని ఏమీ చేయలేదులే అని  దానిని చిత్ర హింసలకు గురి చేశారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకోగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


చిరుతపులి అంత దూరంలో కనపడితే ఏం చేస్తారు..? బాబోయ్ చిరుత అని దూరంగా పారిపోతారు. ఎందుకంటే, చిరుతకి ఆకలివేస్తే,వేటాడి తినేస్తుందనే విషయం అందరికీ తెలుసు. అదే చిరుత అనారోగ్యంతో బాధపడుతూ గ్రామస్థులకు కనపడింది. ఇంకేముంది అది మనల్ని ఏమీ చేయలేదులే అని దానిని చిత్ర హింసలకు గురి చేశారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకోగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


మధ్యప్రదేశ్‌లోని ఇక్లెరాకు చెందిన గ్రామస్థులు చిరుతపులిని చిత్రహింసలకు గురిచేసే షాకింగ్ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ గా మారింది. అస్వస్థతతో ఉన్న చిరుతపులిని డజనుకు పైగా మనుషులు చుట్టుముట్టారు. ఎర్రటి ప్యాంటులో ఉన్న ఒక వ్యక్తి ఇతరులను దూరంగా నెట్టివేసి చిరుతపులి వీపుపై కూర్చోవడానికి ప్రయత్నించడం గమనార్హం.

మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లా ఇక్లెరా సమీపంలోని అడవిలో చిరుతపులి సంచరిస్తూ కనిపించింది. కొంతమంది గ్రామస్తులు మొదట భయపడ్డా, చిరుత దూకుడుగా ఉండక నీరసంగా ఉండడం చూసి.. అది అస్వస్థతకు గురైందని అర్థమైంది.

గ్రామస్థులు చిరుతపులి చుట్టూ చేరి దానితో ఆడుకోవడం ప్రారంభించారు. వారు దానితో సెల్ఫీలు తీసుకున్నారు, ఒక వ్యక్తి దానిని తొక్కడానికి ప్రయత్నించడం గమనార్హం.

గ్రామస్థులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. ఉజ్జయిని నుంచి రెస్క్యూ టీం ఇక్లెరాకు చేరుకుని చిరుతను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లింది.

ఈ వింత ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. "అభివృద్ధి ముసుగులో ఇప్పటికే వారి స్థలాన్ని ఆక్రమిస్తున్నాం, ఇప్పుడు వారి గోప్యతను కూడా ఇబ్బంది పెడుతున్నాం. మనుషులుగా మనం సిగ్గుపడాలి" అని ఓ వ్యక్తి ఆ వీడియో కింద కామెంట్ చేయడం విశేషం.
ఆ రెండేళ్ల చిరుతపులిని చికిత్స నిమిత్తం భోపాల్‌లోని వాన్ విహార్‌కు తీసుకెళ్లినట్లు అటవీ అధికారి సంతోష్ శుక్లా తెలిపారు. పశువైద్యుడు జంతువుకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించినట్లు ఆయన తెలిపారు.